హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Results Announced: అభ్యర్థులకు అలర్ట్.. ఆ ఫలితాలు విడుదల..

Results Announced: అభ్యర్థులకు అలర్ట్.. ఆ ఫలితాలు విడుదల..

Results Announced: అభ్యర్థులకు అలర్ట్.. ఆ ఫలితాలు విడుదల..

Results Announced: అభ్యర్థులకు అలర్ట్.. ఆ ఫలితాలు విడుదల..

UGC NET Results : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA UGC NET ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక సైట్‌లో ugcnet.nta.nic.in తనిఖీ చేసుకొని తమ ఫలితాలను చూసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) UGC NET ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక సైట్‌లో ugcnet.nta.nic.in తనిఖీ చేసుకొని తమ ఫలితాలను చూసుకోవచ్చు. UGC NET ఫలితాలను nta.ac.in అండ్ ntaresults.nic.inలో కూడా తనిఖీ చేయవచ్చు. యూజీసీ నెట్ ఆన్సర్ షీట్లు, కీని నవంబర్ 1, 2022న విడుదల చేయగా.. నేడు ఫలితాలను విడుదల చేశారు. యూజీసీ నెట్ పరీక్ష దేశవ్యాప్తంగా వివిధ తేదీల్లో నిర్వహించబడింది. జూలై 9, 11, 12.. సెప్టెంబర్ 20, 21, 22, 23, 29, 30.. అక్టోబర్ 1, 8, 10, 11, 12, 13, 14 మరియు 22, 2022. ప్రాథమిక కీ అక్టోబర్ 24, 2022న విడుదల చేయగా.. ఫైనల్ కీని నవంబర్ 1, 2022న విడుదల చేశారు.

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..

- UGC NET యొక్క అధికారిక సైట్‌ని ugcnet.nta.nic.inను సందర్శించడండి.

-తర్వాత హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న UGC NET రిజల్ట్స్ 2022 లింక్‌పై క్లిక్ చేయండి.

-లాగిన్ వివరాలను నమోదు చేసి.. సమర్పించుపై క్లిక్ చేయండి.

-మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.

-అడ్మిట్ కార్డ్‌ని పేజీని డౌన్‌లోడ్ చేయండి.

- తదుపరి అవసరం కోసం అదే హార్డ్ కాపీని ప్రింట్ తీసుకోండి.

సబ్జెక్ట్ వైస్ ఎన్ని మార్కులు వచ్చాయి, కట్ ఆఫ్ మార్కుల గురించి పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి తెలసుకోండి. పీహెచ్‌డీని కొనసాగించాలనుకునే లేదా ప్రొఫెసర్‌లుగా బోధన ప్రారంభించాలనుకునే లక్షలాది మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఈ పరీక్షకు హాజరవుతారు. UGC NET 'అసిస్టెంట్ ప్రొఫెసర్' మరియు 'జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్' కోసం ఈ సెట్ పరీక్ష అర్హతను నిర్ణయిస్తుంది. వీటిలో మంచి ప్రతిభ కనబరిచిన వారు భారతీయ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

యూజీసీ నెట్ పరీక్షలో పాస్ కావాలంటే అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాల్సి ఉండగా, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. ఓవరాల్‌గా మాత్రమే కాకుండా, అభ్యర్థులు ప్రతి పేపర్‌‌లోనూ విడిగా పాస్ కావాల్సి ఉంటుంది.

WCL Recruitment 2021: వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 900 ఖాళీలు.. పూర్తి వివరాలిలా..

గతంలో ఏడాదికి రెండుసార్లు

కరోనా కారణంగా యూజీసీ నెట్ పరీక్షలను విలీనం చేస్తామని యూజీసీ గతేడాది ప్రకటించింది. అంతకు ముందు ఏడాదికి రెండుసార్లు యూజీసీ నెట్ పరీక్షను నిర్వహించేవారు. దీంతో ప్రతి సెషన్‌లో ఆరు శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించేవారు. అయితే కరోనా కారణంగా ఒకేసారి మాత్రమే పరీక్ష నిర్వహించడం వల్ల ఒక సెషన్ అవకాశాన్ని కోల్పోతున్నామని కొందరు విద్యార్థులు వాపోయారు. దీంతో అర్హత మార్కుల శాతాన్ని 12 కు పెంచాలని డిమాండ్ చేశారు.

First published:

Tags: Career and Courses, Exam results, JOBS, UGC NET, Ugc results

ఉత్తమ కథలు