UGC NET 2020: గుడ్ న్యూస్... యూజీసీ నెట్ దరఖాస్తు గడువు మరోసారి పెంపు

UGC NET 2020: గుడ్ న్యూస్... యూజీసీ నెట్ దరఖాస్తు గడువు మరోసారి పెంపు (ప్రతీకాత్మక చిత్రం)

NTA UGC NET 2020 | యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు దరఖాస్తు చేయనివారికి మరో అవకాశం ఇచ్చింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది.

  • Share this:
    యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2020 సెషన్‌కు దరఖాస్తు చేయలేకపోయినవారికి శుభవార్త. దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA. కరోనా వైరస్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని మరోసారి దరఖాస్తు తేదీని పొడిగిస్తున్నట్టు ఎన్‌టీఏ ప్రకటించింది. యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2020 మొదట విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తుకు 2020 ఏప్రిల్ 16 చివరి తేదీ. కానీ ఇప్పటికి నాలుగుసార్లు దరఖాస్తు గడువును పొడిగించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA. మొదట మే 16 వరకు, ఆ తర్వాత మే 31 వరకు, తర్వాత జూన్ 15 వరకు, ఇప్పుడు జూన్ 30 వరకు దరఖాస్తు గడువును పెంచింది. యూజీసీ నెట్ 2020 జూన్ సెషన్‌కు అప్లై చేయలేని అభ్యర్థులకు జూన్ 30 వరకు అవకాశం ఉంది.

    యూజీసీ ప్రతీ సంవత్సరం నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జూన్ సెషన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవానికి జూన్‌లోనే యూజీసీ నెట్ 2020 పరీక్ష పూర్తి కావాలి. కానీ లాక్‌డౌన్ కారణంగా ఇంకా దరఖాస్తు ప్రక్రియే కొనసాగుతోంది. యూజీసీ నెట్ 2020 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో త్వరలో ప్రకటించనుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. పీజీ పాసైనవారు, చివరి సంవత్సరం చదువుతున్నవారు యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేయొచ్చు. ఇందులో క్వాలిఫై అయినవారికి ఫెలోషిప్స్ పొందే అవకాశం లభిస్తుంది. అసిస్టెంట్ లెక్చర్‌షిప్ లేదా జేఆర్ఎఫ్ పోస్టులకు అర్హత కూడా సాధిస్తారు. విద్యార్హతల వివరాలు చూస్తే సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. పీజీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ఫీజు జనరల్, అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1,000. ఈబీసీ, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.250.

    ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://ugcnet.nta.nic.in/ వెబ్‌సైట్ చూడొచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలంటే యూజీసీ నెట్ ఎగ్జామ్ పాస్ కావడం తప్పనిసరి. నెట్ పాసైన వారికే యూనివర్సిటీలు, కాలేజీల్లో ప్రొఫెసర్లుగా పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ అర్హత పొందితే ఎంఫిల్, పీహెచ్‌డీ చేసేందుకు మొదటి రెండేళ్ల పాటు నెలకు రూ.25,000 పారితోషికం లభిస్తుంది. రెండేళ్ల వ్యవధి పూర్తైన తర్వాత అభ్యర్థి ప్రోగ్రెస్ పరిశీలిస్తారు. పరిశోధనలో ప్రగతి సంతృప్తికరంగా ఉంటే సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ లభిస్తుంది. మూడేళ్ల పాటు నెలకు రూ.25,000 పారితోషికం లభిస్తుంది. యూజీసీ నెట్ స్కోర్ ఆధారంగా ప్రభుత్వ సంస్థల్లో కూడా ఇతర ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఏడాది ONGC యూజీసీ నెట్ స్కోర్ ఆధారంగా నియామక ప్రక్రియ చేపట్టింది. ప్రైవేట్ కాలేజీల్లో కూడా యూజీసీ నెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. యూజీసీ నెట్ పాసైనవాళ్లు ఔత్సాహికులకు కోచింగ్ కూడా ఇవ్వొచ్చు. యూజీసీ నెట్ పాసైనవారిని నియమించుకునే కోచింగ్ సెంటర్లున్నాయి.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    UPSC Jobs: డిఫెన్స్, నేవీలో 413 ఉద్యోగాలు... ఇంటర్ పాసైతే చాలు

    UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్



    Telangana Jobs: గచ్చిబౌలిలోని టిమ్స్‌లో 499 ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
    Published by:Santhosh Kumar S
    First published: