హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main Exam: జేఈఈ మెయిన్ పరీక్షల తేదీల్లో మార్పులు.. NTA కీలక నిర్ణయం.. కొత్త తేదీలివే..

JEE Main Exam: జేఈఈ మెయిన్ పరీక్షల తేదీల్లో మార్పులు.. NTA కీలక నిర్ణయం.. కొత్త తేదీలివే..

జేఈఈ మెయిన్(JEE Main) ఎగ్జామ్ తేదీలను మార్చుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జేఈఈ మెయిన్(JEE Main) ఎగ్జామ్ తేదీలను మార్చుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జేఈఈ మెయిన్(JEE Main) ఎగ్జామ్ తేదీలను మార్చుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    జేఈఈ మెయిన్(JEE Main) పరీక్షల విషయంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష తేదీలను రీషెడ్యూల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 16 నుంచి 21 మధ్య జేఈఈ ఎగ్జామ్ జరగాల్సి ఉంది. అయితే.. వివిధ రాష్ట్రాల్లో ఇంటర్ ఎగ్జామ్స్ ఆయా తేదీల్లో ఉన్నాయి. దీంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో స్పందించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల తేదీలను మార్చుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1 4 తేదీల్లో జేఈఈ మెదటి సెషన్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.

    ఇదిలా ఉంటే.. జేఈఈ ఎగ్జామ్స్ తేదీలతో క్లాష్ కావడంతో తెలంగాణ, ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ ను అధికారులు ఇప్పటికే రీ షెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు జేఈఈ పరీక్షలను రీషెడ్యూల్ చేసిన అధికారులు కొత్త తేదీలను విడుదల చేశారు. అయితే ఈ కొత్త తేదీలు రీ షెడ్యూల్ చేసిన ఇంటర్, తెలంగాణ ఎగ్జామ్స్ తేదీలు మళ్లీ క్లాష్ అయ్యాయి. దీంతో తెలంగాణ, ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ తేదీలు మళ్లీ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో జేఈఈ మెయిన్ మొదటి విడత ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అయితే తెలంగాణలో ఏప్రిల్ 22న ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభమై మే 7న ముగియనున్నాయి.

    NEET, JEE Main: నీట్, జేఈఈ మెయిన్‌ విద్యార్థులకు అలర్ట్.. ఇక నుంచి ఫ్రీ వీడియో క్లాసెస్.. వివరాలిలా..

    ఇంకా ఏపీ విషయానికి వస్తే అక్కడ ఇంటర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 22న ప్రారంభమై మే 7న ముగియనున్నాయి. అయితే.. ఇంటర్ ఎగ్జామ్స్, జేఈఈ ఎగ్జామ్స్ ఒకే సారి ఉండడంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలు, ప్రిపరేషన్ విషయంలో ఇబ్బందులు పడే పరిస్థతి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఎగ్జామ్స్ కు సంబంధించిన తేదీలను మార్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంటర్ ఎగ్జామ్స్ ను జేఈఈ మెయిన్స్ పరీక్షల కారణంగా అధికారులు ఓ సారి రీ షెడ్యూల్ చేశారు. అయితే.. జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ను తాజాగా రీ షెడ్యూల్ చేయడంతో తెలంగాణ, ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ ను రీ షెడ్యూల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    JEE Main 2022: జేఈఈ మెయిన్‌కు 30 రోజులే వ్యవధి.. విజయం సాధించేందుకు నిపుణుల సూచనలు ఇవే..!

    అయితే.. ఈ అంశంపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి స్పందించారు. ఇంటర్ పరీక్షల తేదీలపై జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్ తేదీల ప్రభావం పడే అవకాశం ఉండడంతో తేదీలను తప్పక మార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ రోజు, రేపు ఈ అంశంపై స్పష్టత ఇస్తామని మంత్రి వివరించారు. మంత్రి ప్రకటన నేపథ్యంలో తెలంగాణలో అయితే తప్పనిసరిగా ఇంటర్ ఎగ్జామ్స్ తేదీలు మార్చనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఎగ్జామ్స్ తేదీలను మారుస్తారా? లేదా? అన్న అంశంపై రేపటిలోగా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

    First published:

    Tags: Career and Courses, Exams, Exams postponed, Jee mains 2022

    ఉత్తమ కథలు