NEET Exam: నీట్​ విద్యార్థులకు గమనిక.. పరీక్ష హాల్లోకి ఏం తీసుకురావద్దో గైడ్​లైన్స్​ విడుదల చేసిన ఎన్​టీఏ

ప్రతీకాత్మక చిత్రం

నీట్​ పరీక్ష ఈ సారి 11 ప్రాంతీయ భాషల్లో జరగనుంది. కాగా, పరీక్ష హాల్లోకి  (Hall) తీసుకురావాల్సిన సామగ్రి (Items) గురించి National testing Agency నియమ, నిబంధనలు వెల్లడించింది. అభ్యర్థులకు పరీక్ష హాలు వెలుపలే థర్మల్​ స్ర్కీనింగ్​ చేయనున్నారు. విద్యార్థులు తప్పనిసరిగా కరోనా గైడ్ లైన్స్ పాటించాలని అధికారులు సూచించారు.

  • Share this:
    నీట్ (నేషనల్​ ఎంట్రన్స్​ కమ్​ ఎలిజిబిలిటీ టెస్ట్​). వైద్య విద్య కోసం లక్షలాది విద్యార్థులు (Students) పోటీ పడి రాసే జాతీయ స్థాయి పరీక్ష (National level Exam). సెప్టెంబర్ 12న నీట్ (NEET) పరీక్ష జరగనుంది. దేశ వ్యాప్తంగా ఈ పరీక్షకు 16 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షమంది వరకు ఈ పరీక్ష (Exam) రాయనున్నారు. దేశ వ్యాప్తంగా 202 పట్టణాల్లో 3,842 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ‌ (Telangana)లోని 7 ప‌ట్ట‌ణాల్లో 112 కేంద్రాలను (Centers) ఏర్పాటు చేయగా, ఏపీలో 9 ప‌ట్ట‌ణాల్లో 151 కేంద్రాల్లో ప‌రీక్ష‌కు ఏర్పాట్లు చేశారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.

    నీట్​ పరీక్ష ఈ సారి 11 ప్రాంతీయ భాషల్లో (Regional languages) జరగనుంది. కాగా, పరీక్ష హాల్లోకి  (Hall) తీసుకురావాల్సిన సామగ్రి (Items) గురించి National testing Agency నియమ, నిబంధనలు తెలిపింది. అభ్యర్థులకు పరీక్ష హాలు వెలుపలే థర్మల్​ స్ర్కీనింగ్​ చేయనున్నారు. పరీక్ష కేంద్రంలోకి అడ్మిట్‌ కార్డు, ఫొటో, గుర్తింపు కార్డు మాత్రమే అనుమతించనున్నట్టు నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పష్టంచేసింది. పరీక్ష ఆఫ్ లైన్ విధానంలోనే జరుగుతోంది. విద్యార్థులు తప్పనిసరిగా కరోనా గైడ్ లైన్స్ పాటించాలని అధికారులు సూచించారు. మాస్క్ తప్పని సరి ధరించాలని తెలిపారు. షూ, ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేసుకోవద్దని తెలిపారు.

    ఈ నిబంధనలు మరచిపోవద్దు..

    1.  నీట్‌ పరీక్ష రాసే విద్యార్థులు (Students) లేత దుస్తులు (light clothes with half sleeves) మాత్రమే ధరించాలి. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా పొడుగు చేతులుండే డ్రెస్‌లు వేసుకోవద్దు. ఒకవేళ మతపరమైన సంప్రదాయం ప్రకారం అలాంటి దుస్తులు వేసుకోవాల్సి వస్తే.. అలాంటి వారు మధ్యాహ్నం 12.30 గంటలకు పరీక్ష కేంద్రానికి రావాలి.

    2. . అభ్యర్థులు బూట్లు(Shoes) వేసుకుని వస్తే పరీక్ష హాలులోకి అనుమతించరు. స్లిప్పర్లు, తక్కువ హీల్‌ ఉండే శాండిల్స్‌ మాత్రమే వేసుకుని రావాలి.

    3 వ్యాలెట్‌ (wallet), పౌచ్‌, గాగుల్స్‌, టోపీలు, హ్యాండ్‌ బ్యాగులు (hand bags) వంటివి తీసుకురావొద్దు.

    4.  పెన్సిల్‌ బాక్సు, కాలిక్యులేటర్‌ (Calculators), పెన్ను(Pen), స్కేల్‌, రైటింగ్‌ ప్యాడ్‌ వంటివి కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

    5. మొబైల్‌ ఫోన్‌ (Mobile Phone), బ్లూటూత్‌, ఇయర్‌ ఫోన్స్‌, హెల్త్‌ బ్యాండ్‌, వాచ్‌ (Watch)లు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు కూడా తమ వెంట  తీసుకురావొద్దు.

    6. చెవిపోగులు (Ear rings), చైన్లు (Chains), ముక్కు పుడక, నెక్లెస్‌, బ్రాస్‌లెట్‌ వంటి ఆభరణాలు వేసుకోవద్దు.

    7.  అభ్యర్థులు తమ వెంట ఎలాంటి ఆహార పదార్థాలు, వాటర్‌ బాటిల్లు (water bottles) కూడా తీసుకురావొద్దు.
    Published by:Prabhakar Vaddi
    First published: