స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పైరింగ్ మైండ్స్ (SWAYAM) 2022, జులై సెమిస్టర్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్లలోని తప్పులను కరెక్ట్ చేసుకోవడానికి తాజాగా కరెక్షన్ విండో (Correction Window) ఓపెన్ చేసింది. ఈ కరెక్షన్ విండో జనవరి 24న ఓపెన్ అయి, జనవరి 26న క్లోజ్ అవుతుంది. అంటే మరికొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి అభ్యర్థులు కరెక్షన్స్ చేయడానికి త్వరగా అఫీషియల్ వెబ్సైట్ swayam.nta.ac.inకి వెళ్లి దిద్దుబాట్లు చేసుకోవడం మంచిది.
స్వయం (SWAYAM) జులై 2022 సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 25, 26 తేదీల్లో జరగనున్నాయి. ఈ పరీక్షలు రెండు షిఫ్టులలో నిర్వహిస్తారు. మొదటి షిఫ్టు ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు జరుగుతుంది. రెండవది మధ్యాహ్నం 3:00 నుంచి సాయంత్రం 6:00 వరకు ఉంటుంది.
NTA అఫీషియల్ నోటీసు ప్రకారం, "కరెక్షన్ విండో" ఓపెన్ అయిన తర్వాత అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లో ఇప్పటికే సబ్మిట్ చేసిన సమాచారంలో మార్పులు లేదా దిద్దుబాట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే అభ్యర్థులు తమ కోరిక మేరకు వారి దరఖాస్తుకు మరిన్ని కోర్సులను యాడ్ చేసుకోవచ్చు. కరెక్షన్ విండో వ్యవధిలో మాత్రమే ఈ మార్పులు చేయడం కుదురుతుంది.
* స్వయం జులై 2022 సెమిస్టర్ ఎగ్జామ్స్ కరెక్షన్స్ ఎలా చేయాలి
అభ్యర్థులు మొదటగా స్వయం అఫీషియల్ వెబ్సైట్ swayam.nta.ac.in ను ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీ ఓపెన్ అయ్యాక కిందకు స్క్రోల్ చేయాలి. అప్పుడు కరెక్షన్ విండో జులై 2022 సెమిస్టర్ అని ఇంగ్లీషులో ఒక లింక్ కనిపిస్తుంటుంది. మీ అప్లికేషన్లో కరెక్షన్స్ చేయడానికి ఆ లింక్‌పై క్లిక్ చేయాలి.
లింక్‌పై క్లిక్ చేశాక మీరు కొత్త పేజీకి రీ-డైరెక్ట్ అవుతారు. (https://swayam.nta.ac.in/SWAYAM9/VerificationEMAIL.aspx). ఈ పేజీలో మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్ ఐడీ, ఓటీపీ వంటి లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి మీ అప్లికేషన్ ఫారమ్‌ను యాక్సెస్ చేయాలి. తరువాత అప్లికేషన్లో చేయాల్సిన మార్పులు కరెక్షన్స్ చేసేయాలి.
ఇది కూడా చదవండి : స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. రూ.50వేల స్కాలర్షిప్.. అర్హతలు ఇవే..
కరెక్షన్స్ చేయడం పూర్తయ్యాక దానిని సబ్మిట్ చేసే ముందు మీ దరఖాస్తును ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. అంతా ఓకే అనుకున్న తర్వాత మీరు మీ దరఖాస్తును సబ్మిట్ చేయాలి. దీనిని ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింటవుట్ తీసుకోవడం మంచిది.
అప్లికేషన్ ప్రాసెస్‌కు సంబంధించి విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే, వారు swayam@nta.ac.in ఈమెయిల్ అడ్రస్‌కు మెయిల్ పంపడం ద్వారా NTA (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ)ని సంప్రదించవచ్చు. లేదా 011-4075900, 011-69227700 నంబర్స్ ద్వారా ఏజెన్సీ హెల్ప్ డెస్క్‌కు కాల్ చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, JOBS