హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NTA NEET 2021: నీట్-2021 పరీక్షా విధానంలో మార్పులు.. ఎలా ఉంటుందంటే?

NTA NEET 2021: నీట్-2021 పరీక్షా విధానంలో మార్పులు.. ఎలా ఉంటుందంటే?

నీట్ తాజా షెడ్యూల్‌ను వాయిదా వేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో #PostponeNEETUG అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. "సెప్టెంబరు 12న నీట్ యూజీ, సెప్టెంబరు 13న ఐసీఏఆర్ యూజీ పరీక్షలు ఉన్నాయి. రోజు మార్చి రోజు ఒకేసారి ఈ పరీక్షలకు హాజరుకావడం అసాధ్యం" అని ఒక విద్యార్థి ట్వీట్ చేశాడు. దయచేసి విద్యార్థులు ఏమనుకుంటున్నారో కూడా వినండని ఇంకో యూజర్ పోస్ట్ పెట్టాడు.

నీట్ తాజా షెడ్యూల్‌ను వాయిదా వేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో #PostponeNEETUG అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. "సెప్టెంబరు 12న నీట్ యూజీ, సెప్టెంబరు 13న ఐసీఏఆర్ యూజీ పరీక్షలు ఉన్నాయి. రోజు మార్చి రోజు ఒకేసారి ఈ పరీక్షలకు హాజరుకావడం అసాధ్యం" అని ఒక విద్యార్థి ట్వీట్ చేశాడు. దయచేసి విద్యార్థులు ఏమనుకుంటున్నారో కూడా వినండని ఇంకో యూజర్ పోస్ట్ పెట్టాడు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నీట్​–2021 పరీక్షను సెప్టెంబర్ 12న నిర్వహించనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, ఈ ఏడాది నీట్​ పరీక్షా విధానంలో కొన్ని మార్పులు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలో మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకై ఏటా నిర్వహించే నేషనల్​ ఎలిజిబులిటీ కమ్​ ఎంట్రన్స్​ టెస్ట్​ (నీట్​)–2021 పరీక్ష షెడ్యూల్​ విడుదలైంది. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నీట్​–2021 పరీక్షను సెప్టెంబర్ 12న నిర్వహించనుంది. అయితే, ఈ ఏడాది నీట్​ పరీక్షా విధానంలో కొన్ని మార్పులు చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది విద్యాబోధన అంతా ఆన్​లైన్​లో జరిగింది. దీంతో, సిలబస్ అంతా పూర్తి కాలేదు. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు నీట్​ ఎగ్జామ్​లో కొత్త పరీక్షా విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఎన్​టీఏ స్పష్టం చేసింది. కాబట్టి, నీట్​–2021 పరీక్షకు ప్రిపేరవుతున్న విద్యార్థులు పరీక్షా విధానంపై కచ్చితంగా అవగాహన పెంచుకోవాలి. నూతనంగా ప్రవేశపెట్టిన పరీక్షా విధానంపై దృష్టిసారించాలి.

నీట్​ నూతన పరీక్షా విధానం..

1. నీట్​ పరీక్ష ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్ట్స్​లపై జరుగుతుంది. ప్రతి సబ్జెక్టులో సెక్షన్ ఎ, సెక్షన్ బి అనే రెండు విభాగాలుంటాయి.

2. ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన సెక్షన్ ఎలో 35 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు కేటాయించారు.

3. ఇక, ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన సెక్షన్ బిలో 15 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు వాటిలో నుంచి ఏవేనీ 10 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు కేటాయించారు. కాబట్టి, ప్రతి సబ్జెక్టులోని సెక్షన్ బీలో 5 అదనపు ప్రశ్నలు వస్తాయని చెప్పవచ్చు.

4. ఈ నూతన పరీక్షా విధానం బోర్డు ఎగ్జామ్​ను పొలి ఉంటుంది.

5. నీట్​ ఎగ్జామ్​లో నెగెటివ్​ మార్కింగ్​ కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.

కాగా, నీట్​ ఈ పరీక్షను మొత్తం 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు. ఇంగ్లీష్, హిందీ మాత్రమే కాకుండా అభ్యర్థి ఎంచుకున్న స్థానిక భాషలో కూడా ప్రశ్నాపత్రం ఉంటుంది. ఉదాహరణకు తెలుగు భాషను ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు తెలుగు, ఇంగ్లిష్​ రెండు భాషల్లో ప్రశ్నలొస్తాయి. కాగా, మెడికల్​ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే నీట్​ పరీక్షను తొలుత ఆగస్ట్​ 1నే నిర్వహించాలని కేంద్రం భావించింది. అయితే, కరోనా సెకండ్​వేవ్​ నేపథ్యంలో వాయిదా వేసింది. ఎట్టకేలకు సెప్టెంబర్​ 12న నిర్వహించనున్నట్లు తెలిపింది. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు కోవిడ్​ నిబంధనలు తప్పక పాటించాలని స్పష్టం చేసింది.

First published:

Tags: Exams, National Testing Agency, NEET 2021

ఉత్తమ కథలు