మీరు ఇంటర్ పాసయ్యారా? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారా? వైద్య వృత్తిలో స్థిరపడటం మీ కలా? అయితే మీకు శుభవార్త. ప్రతీ ఏటా జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-NEET దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మెడికల్ అడ్మిషన్స్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA నీట్ 2020 పరీక్ష నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA అధికారిక వెబ్‌సైట్ ntaneet.nic.in ఓపెన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఏడాది నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ లాంటి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రోగ్రామ్స్ కోసం ఒకే ఎంట్రెన్స్ టెస్ట్ నీట్ 2020 మాత్రమే జరగనుంది. గతంలో AIIMS, PIGMER లాంటి సంస్థలు వేర్వేరుగా ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహించేవి. కానీ... 2020-21 విద్యాసంవత్సరం నుంచి ఒకే ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి ఎయిమ్స్, జిమ్‌మర్, ప్రైవేట్ కాలేజీలు, రాష్ట్ర ప్రభుత్వ కాలేజీలు, AFMC, ESIC లాంటి విద్యాసంస్థల్లో అన్ని మెడికల్, డెంటల్ సీట్లు నీట్ 2020 ద్వారానే భర్తీ కానున్నాయి. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలనుకునేవారు కూడా నీట్ 2020 ఎగ్జామ్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 2
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 1 రాత్రి 11.50 గంటలు
దరఖాస్తు ఫామ్‌లో తప్పులు కరెక్షన్స్- 2020 జనవరి 15 నుంచి 2020 జనవరి 31
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్- 2020 మార్చి 27
పరీక్ష తేదీ- 2020 మే 3
ఫలితాల విడుదల- 2020 జూన్ 4
విద్యార్హత- 10+2 పూర్తైన, 10+2 చదువుతున్నవారు నీట్ 2020 పరీక్షకు దరఖాస్తు చేయొచ్చు.
సబ్జెక్ట్- 10+2 స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ / బయో టెక్నాలజీ ఉండాలి. ఇంగ్లీష్‌తో పాటు మ్యాథమెటిక్స్ కూడా ఉండాలి.
వయస్సు- 2019 డిసెంబర్ 31 నాటికి కనీస వయస్సు 17 ఏళ్లు. గరిష్ట వయస్సు 25 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 ఏళ్లు గరిష్టవయస్సులో పరిమితి ఉంటుంది.
ఫీజు- గతంతో పోలిస్తే మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫీజు 5% నుంచి 7% పెరిగింది. జనరల్ అభ్యర్థులకు రూ.1500, జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1400, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు రూ.800.
దరఖాస్తు చేయాల్సిన వెబ్‌సైట్స్: www.nta.ac.in, ntaneet.nic.in
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA జారీ చేసిన నీట్ 2020 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్‌లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... రియల్‌మీ 5ఎస్ ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
CISF Jobs: సీఐఎస్ఎఫ్‌లో 300 హెడ్ కానిస్టేబుల్ జాబ్స్
Navy Jobs: ఇండియన్ నేవీలో జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు... ఇంటర్, బీటెక్ అర్హత
SAIL Jobs: స్టీల్ అథారిటీలో 399 మేనేజ్‌మెంట్ ట్రైనీ జాబ్స్... నోటిఫికేషన్ డీటైల్స్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.