NTA NEET-UG 2020 application steps | అభ్యర్థులు ntaneet.nic.in వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు డిసెంబర్ 31 చివరి తేదీ. మరి నీట్ 2020 పరీక్షకు ఎలా దరఖాస్తు చేయాలో, ఫాలో కావాల్సిన స్టెప్స్ ఏవో తెలుసుకోండి.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-NEET 2020 దరఖాస్తు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో జాయిన్ కావాలనుకునేవారు ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇంటర్ పాసైనవారితో పాటు ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేయొచ్చు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA ఈ పరీక్ష నిర్వహిస్తోంది. అభ్యర్థులు ntaneet.nic.in వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు డిసెంబర్ 31 చివరి తేదీ. మరి నీట్ 2020 పరీక్షకు ఎలా దరఖాస్తు చేయాలో, ఫాలో కావాల్సిన స్టెప్స్ ఏవో తెలుసుకోండి.
NEET 2020: దరఖాస్తు విధానం ఇదే...
అభ్యర్థులు ముందుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA నీట్ 2020 కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్ ntaneet.nic.in ఓపెన్ చేయాలి.
ముందుగా నీట్ 2020 ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదవాలి. ఆ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆ తర్వాత హోమ్ పేజీలో Fill Application Form లింక్ పైన క్లిక్ చేయాలి.
నీట్ 2020 పరీక్షకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఇది చదివి PROCEED TO APPLY ONLINE NEET (UG) 2020 లింక్ పైన క్లిక్ చేయాలి.
న్యూ రిజిస్ట్రేషన్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది.
అభ్యర్థి పేరు, తల్లి పేరు, తండ్రి పేరు, కేటగిరీ ఎంటర్ చేయాలి.
వికలాంగులు అయితే ఆ విషయాన్ని వెల్లడించాలి.
పుట్టిన తేదీ, జెండర్, జాతీయత, ఆలిండియా కోటా వెల్లడించాలి.
ఐడెంటిఫికేషన్ టైప్ సెలెక్ట్ చేసి ఐడెంటిఫికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్, ఆల్టర్నేట్ ఇమెయిల్ ఐడీ వెల్లడించి సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయాలి.
PREVIEW & NEXT క్లిక్ చేస్తే తర్వాతి పేజీలోకి వెళ్తారు.
ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఫీజు చెల్లించాలి.
చివరగా కన్ఫర్మేషన్ పేజీ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ముఖ్యమైన తేదీలు, ఫీజు వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.