నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) జేఈఈ మెయిన్స్ (JEE Mains) షెడ్యూల్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. జాతీయ స్ధాయిలో నిర్వహించే అతి పెద్ద ఇంజనీరింగ్ పరీక్ష (Exams) అయిన జేఈఈ మెయిన్ ను ప్రతీ ఏడాది 2 సెషన్స్ లో నిర్వహిస్తారు. సాధారణంగా ప్రతీ ఏటా జేఈఈ మెయిన్ పరీక్షలు రెండు విడతలుగా జనవరి, ఏప్రిల్ నెలల్లో జరుగుతాయి. కానీ, కోవిడ్ కారణంగా ఈ ఏడాది నిర్వహించే జేఈఈ మెయిన్-2022 (JEE Main 2022) పరీక్షలను జూన్, జూలై నెలల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జేఈఈ మెయిన్స్- 2022లో అర్హత సాధించడం కోసం అభ్యర్థులు సిద్దమవుతున్నారు.
ఇంటర్మీడియట్ పరీక్షలను పూర్తి చేసిన విద్యార్థులు.. జేఈఈ మెయిన్స్ కోసం సిద్దమవుతున్నారు. అయితే ఎలా ప్రిపేర్ అయితే మంచి మార్కులు వస్తాయన్న విషయంపై సరైన అవగాహన కలిగివుండాలి. లేకపోతే జేఈఈ, నీట్ వంటి ఎగ్జామ్స్ కు సరిగ్గా ప్రిపేర్ కాలేక పరీక్షల్లో ఫెయిల్ అయ్యే ఛాన్స్ వుంది. అందువల్ల ఈ పరీక్షల్లో మంచి మార్కులు సాధించి, మంచి ర్యాంక్ సాధించడం కోసం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ కు సిద్దమవ్వాలంటే మంచి ప్రణాళిక ఉండాలి. సిలబస్ గురించి మంచి అవగాహన ఉండాలి. అప్పుడు జేఈఈ ని మంచి మార్కులతో పాసై కోరుకున్న చోట ఇంజనీరింగ్ జాయిన్ కావొచ్చు. కొంతమంది సిలబస్ ఎలా ఉంటుంది, ఎలా చదవాలన్న విషయంపై కొంత మదనపడుతుంటారు. సిలబస్ లో ఏం చవవాలి, ఏం చదవకూడదు, పరీక్షలో ఏ సబ్జెక్స్ ముందు అటెండ్ చేయాలన్న ప్లాన్ వుండాలి.
జేఈఈ మెయిన్ -2022 ఆన్ లైన్ ఎగ్జామ్ గురించి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతీ ఏడాదిలా కాకుండా ఈ ఏడాది ఎగ్జామ్ ప్రాట్రన్ కాస్త మారింది. గత ఏడాది వరకూ మొత్తం 75 ప్రశ్నలు ఇచ్చి, అన్ని సమాధానాలు రాయాల్సి ఉండేది. ప్రతీ ప్రశ్నకు జవాబు రాయాల్సి ఉండేది. కానీ ఈ ఏడాది 5 ఛాయిస్ ప్రశ్నలు కూడా ఇచ్చి 25 ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే రాయాల్సి ఉంటుంది.
1. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ మూడు సెక్షన్లుగా వుంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ అనే సెక్షన్లు ఉంటాయి.
2.ఈ మూడు సెక్షన్లు ఒక్కొక్కటి 30 ప్రశ్నలు చొప్పున, 90 ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఒక్కో సబ్జెక్ట్ లో 25 ప్రశ్నలు రాస్తే సరిపోతుంది. 5 ప్రశ్నలు ఛాయిస్ కింద వదిలేయవచ్చు. అంటే 75 ప్రశ్నలకు గానూ 4 మార్కుల చొప్పున 300 మార్కులకు పరీక్ష ఉంటుంది.
3. ఒక్కో సబ్జెక్ట్ లో ఇచ్చే 30 ప్రశ్నల్లో సెక్షన్-ఏ లో మొదటి 20 ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, సెక్షన్-బీ లో తర్వాతి 10 ప్రశ్నలు న్యూమరికల్ ప్రశ్నలు వుంటాయి. ఈ న్యూమరికల్ ప్రశ్నలకు 0 నుండి 9 మధ్య జవాబులు ఉంటాయి. వాటిలో సరైన ఆన్సర్ ను ఎంచుకొని రాయాల్సి ఉంటుంది.
4.ఈ న్యూమరికల్ ప్రశ్నల్లో ఐదు ప్రశ్నలు ఛాయిస్ కింద వదిలేయవచ్చు. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు మాత్రం అన్ని రాయాల్సి ఉంటుంది.
5. ఒక్కో సరైన సమాధానానికి 4 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ఒక్కో తప్పు ఆన్సర్ కు -1 చొప్పున కట్ చేస్తారు. అంటే 4 తప్పు ఆన్సర్లు రాస్తే.. 4 మార్కులు పోతాయి.
జేఈఈ మెయిస్ లో ఉత్తీర్ణత సాధించాలి, మంచి మార్కులతో ఐఐటీలు, ఎన్ఐటీలలో సీటును సాధించాలంటే.. ఇంటర్మీడిట్ ఫస్టియర్, సెకండియర్ లోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ లో గట్టి పట్టు వుండాలి. ప్రతీ సబ్జెక్ట్ లోని టాపిక్స్ పై అవగాహన కలిగివుండాలి. ఇచ్చిన మూడు గంటల టైమ్ ను చక్కగా వినియోగించుకోవాలి. మొదట ధియరీటికల్ ప్రశ్నలు ఎక్కువగా వచ్చే కెమిస్ట్రీ సెక్షన్ పూర్తి చేయాలి. 40 నుండి 45 నిమిషాల్లో కెమిస్ట్రీలో వచ్చే 25 ప్రశ్నలు పూర్తి చేయాలి. అనంతరం మ్యాధమేటిక్స్ సెక్షన్ ను ఎంచుకొని అందులో వచ్చే 25 ప్రశ్నలను 45 నిమిషాల్లో పూర్తి చేయాలి. అంటే కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సెక్షన్స్ లో వచ్చే 50 ప్రశ్నలను గంటన్నర అంటే 90 నిమిషాల్లో పూర్తి చేసి మిగిలిన గంటన్నర సమయాన్ని ఎక్కువగా మ్యాధమేటికల్ క్వశ్చన్స్ వచ్చే ఫిజిక్స్ లోని 25 ప్రశ్నలు పూర్తి చేయాలి. ఇక ఎగ్జామ్ ను కెమిస్ట్రీ సెక్షన్ తో మొదలుపెట్టి.. తొందరగా పూర్తిచేసి, అనంతరం మ్యాథమేటిక్స్, ఫిజిక్స్ లను పూర్తి చేస్తే.. జేఈఈలో మంచి మార్కులు సాధించవచ్చు.
కెమిస్ట్రీ సబ్జెక్ట్ కు సంబంధించిన సెక్షన్ ను విపులంగా చూస్తే...
జేఈఈ ఎగ్జామ్ లో మన ర్యాంకును నిర్ణయించే కీలకమైన సబెక్టుల్లో కెమిస్ట్రీ ఒకటి. ఇతర సబెక్టులతో పోల్చితే కెమిస్ట్రీలోమంచి స్కోర్ చేయడం చాలా సులభం. ఇందులో ఎక్కువగా మెమరీ ఆధారిత ప్రశ్నలే ఉంటాయి. అందువల్ల జేఈఈ ఎగ్జామ్ ను కెమిస్ట్నీ తో మొదలుపెడితే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. మంచి మార్కులు సాధించవచ్చు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ లలోని మొత్తం టాపిక్స్ ను 3 విభాగాలుగా చూడాలి. ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్‌ఆర్గానిక్ కెమిస్ట్రీ.
ఫిజికల్ కెమిస్ట్రీలో ఈక్విలిబ్రియం, థర్మోడైనమిక్స్, కెమికల్ కైనటిక్స్, ఎలెక్ట్రోకెమిస్ట్రీ వంటివి అతి ముఖ్యమైన చాప్టర్లు. దీంతో వీటిని ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. వీటి నుంచి న్యూమరికల్ వ్యాల్యూ సంబంధిత ప్రశ్నలతో పాటు సింగిల్ చాయిస్ కరెంట్ MCQ ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. అందుకే వీటి పై ఎక్కువగా ఫోకస్ పెట్టాలి..
ఇక ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి రియాక్షన్ అండ్ మెకానిజం ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్, క్వశన్స్ ఆన్ నోమన్‌క్లేచర్, ఎలక్ట్రానిక్ డిస్‌ప్లేస్‌మెంట్ ఎఫెక్ట్స్, కన్వర్షన్స్, నేమ్ రియాక్షన్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అలాగే GOC అండ్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ కార్బోనల్ కాంపౌండ్స్, అమినస్, ఆల్కహాల్ కూడా కొన్ని ముఖ్యమైన టాఫిక్స్. వీటి నుంచి కూడా తరచుగా ప్రశ్నలు వస్తుంటాయి. బయోమాలిక్యూల్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీ డే లైఫ్, పాలిమర్‌ల వంటి చాప్టర్లను కూడా విస్మరించకూడదు. ఎందుకంటే ఈ అంశాల నుంచి కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. సమ్మేళనాలు, లక్షణాలు, పోకడలు ఉంటాయి. విద్యార్థులు సరైన కారణాలతో వీటిని అర్థం చేసుకోవాలి.
మంచి మార్కులు సాధించాలంటే...
కెమిస్ట్రీకి చెందిన NCERT(ఎన్.సీ.ఈ.ఆర్.టీ) సిలబస్‌పై ఇంటెన్సివ్, ప్లాన్డ్ రీడింగ్‌తో ఉండాలి. అలాగే NCERT ఉదాహరణల నుండి ప్రశ్నలను సాల్వ్ చేయడాన్ని ప్రాక్టీస్ చేస్తుండాలి. పి-బ్లాక్, డి-బ్లాక్ వంటి చాప్టర్లకు ట్రెండ్‌లను నేర్చుకోవడం కూడా ముఖ్యమే. అలాగే మంచి స్కోర్ చేయడానికి కోఆర్డినేషన్ కాంపౌండ్‌లోని కాన్సెప్ట్‌లను పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. గ్రాఫ్ లు మొదలగు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
ఇన్‌ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ లలో ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మంచి మార్కులు సాధించవచ్చు. తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీలో, ఆర్గానిక్ కెమిస్ట్రీ లో మంచి మార్కులు సాధించవచ్చు.
మొత్తం 25 ప్రశ్నల్లో ఇన్ ఆర్గానిక్ నుండి 8 నుండి 10 ప్రశ్నల వరకూ రావచ్చు. ఫిజికల్ కెమిస్ట్రీ నుండి 8 నుండి 10 ప్రశ్నలు రావచ్చు.
గ్రాండ్ టెస్ట్ లు, మాక్ టెస్ట్ లు రాయడం, జేఈఈ మోడల్ పేపర్లను రాయడం ద్వారా జేఈఈ మెయిన్ ఎగ్జామ్ ను ఎటువంటి తడబాటు లేకుండా రాసే అవకాశం ఉంటుంది. ఇలా ప్లాన్డ్ గా, సిస్టమేటిక్ గా చదివితే.. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ ను మంచి మార్కులతో, ర్యాంక్ తో క్రాక్ చేయవచ్చు. మంచి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ కావొచ్చు. ఆల్ ది బెస్ట్..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Exam Tips, Exams, Jee main 2022, JOBS