జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కీలక హెచ్చరిక చేసింది. కొంత మంది ఫేక్ వెబ్ సైట్ క్రియేట్ చేసి అభ్యర్థుల నుంచి ఆన్లైన్ అప్లికేషన్లు, ఫీజును తీసుకుకుంటూ మోసం చేస్తున్నారని తెలిపింది. జేఈఈ మెయిన్స్ పరీక్ష కోసం అప్లై చేయాల్సిన వారు కేవలం అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే అప్లై చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. కొంత మంది jeeguide.co.in పేరుతో ఓ ఫేక్ వెబ్ సైట్ ను రూపొందించారని దాన్ని అస్సలు నమ్మ వద్దని అధికారులు సూచించారు. ఈ మేరకు తమకు ఫిర్యాదులు అందాయని NTA తెలిపింది. ఆ వెబ్ సైట్ తో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. తల్లిదండ్రులు, విద్యార్థులు అలాంటి ఫేక్ వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని సూచించింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్
jeemain.nta.nic.in ద్వారా మాత్రామే పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఎవరైనా ఇప్పటికే ఇలాంటి వెబ్ సైట్ ద్వారా మోసపోతే లోకల్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని NTA సూచించింది. ఇదిలా ఉంటే JEE Main ఫిబ్రవరి సెషన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 16న రేపు ముగియనుంది. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ పరిక్షను నాలుగు ఫేజ్ లలో నిర్వహించనున్నారు.
మొదటి ఫేజ్ ఫిబ్రవరి 23 నుంచి 26, అనంతరం రెండు, మూడు, నాలుగవ ఫేజ్ లను మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఈ నాలుగు ఫేజ్ లలో నిర్వహించే పరీక్షలకు హాజరుకావచ్చు. బెస్ట్ స్కోర్ ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
Published by:Nikhil Kumar S
First published:January 15, 2021, 20:09 IST