UGC NET 2019 : యూజీసీ నెట్ హాల్‌‌టికెట్స్ రిలీజ్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

UGC NET 2019 | యూజీసీ నెట్ జూన్ 20,21,24,25,26, 27, 28 తేదీల్లో రెండు విడతల్లో జరుగనుంది. ఉదయం 9.30 నుంచి 12.30 వరకూ మొదటివిడత, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ రెండో విడతల్లో జరుగనుంది.

news18-telugu
Updated: May 28, 2019, 10:59 AM IST
UGC NET 2019 : యూజీసీ నెట్ హాల్‌‌టికెట్స్ రిలీజ్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
యూజీసీ నెట్ హాల్‌టికెట్ రిలీజ్
news18-telugu
Updated: May 28, 2019, 10:59 AM IST
ఇండియాలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(NET) హాల్‌టికెట్స్ రిలీజ్ అయ్యాయి. యూజీసీ నెట్‌ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్వహిస్తోంది. అడ్మిట్ కార్డులు NTA అధికారిక వెబ్‌సైట్ ntanet.nic.in ఓపెన్ చేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూజీసీ నెట్ జూన్ 20,21,24,25,26, 27, 28 తేదీల్లో రెండు విడతల్లో జరుగనుంది. ఉదయం 9.30 నుంచి 12.30 వరకూ మొదటివిడత, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ రెండో విడతల్లో జరుగనుంది.

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..
స్టెప్‌ 1 -ముందుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్ ntanet.nic.in ఓపెన్ చేయండి..

స్టెప్‌ 2-హోమ్ పేజీలో కనిపించే 'admit card 2019' లింక్ పైన క్లిక్ చేయండి.
స్టెప్‌3 -మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ లాంటి వివరాలను ఎంటర్ చేయండి.


స్టెప్‌ 4 -చివరగా సబ్మిట్ పైన క్లిక్ చేస్తే అడ్మిట్ కార్డ్ కనిపిస్తుంది.
స్టెప్‌5-అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.
Loading...
స్టూడెంట్స్‌ గుర్తుంచుకోవాల్సిన అంశాలు..
* పరీక్షకు అడ్మిట్ కార్డ్ తీసుకెళ్లడం తప్పనిసరి.
* అడ్మిట్ కార్డుతో పాటు ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్లాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌లో అప్‌లోడ్ చేసిన ఫోటోనే ఉండాలి.
* ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డ్ తీసుకెళ్లాలి. పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్(ఫోటోతో ఉండాలి), ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్, రేషన్‌కార్డుల్లో ఏదైనా తీసుకెళ్లొచ్చు.
* పరీక్షా కేంద్రానికి పరీక్షా సమయానికంటే రెండు గంటల ముందే వెళ్లాలి.
* మొదటి షిఫ్ట్‌లో ఉదయం 8.30 గంటలు, రెండో షిఫ్ట్‌లో మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత అభ్యర్థుల్ని పరీక్షా కేంద్రానికి అనుమతించరు.
* యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించి ఏదైనా సాయం కావాలంటే 8076535482 లేదా 7703859909 నెంబర్‌కు కాల్ చేయొచ్చు.

ఇవి కూడా చదవండి..

IOCL Jobs : IOCLలో టెక్నీషియన్ అప్రెంటిస్ జాబ్స్.. ఇంటర్ ఉంటే చాలు..

Govt Jobs : తాజా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవే.. అప్లై చేసేయండి..చివరితేదీ 

కేటీఆర్‌కి తొమ్మిదో తరగతి విద్యార్థి ట్వీట్.. రియాక్షన్ ఏంటంటే..
First published: May 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...