అందరికీ నాణ్యమైన విద్య (Education)ను పొందే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్(CUET) తీసుకొచ్చింది. ఈ ఎగ్జామ్ ద్వారా సెంట్రల్ యూనివర్సిటీలలో ప్రవేశాలు పొందవచ్చు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్(CUET UG) 2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ వారంలో మొదలు కానుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ ఛైర్మన్ ఆదేశాల మేరకు.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఈ వారంలోనే రిజిస్ట్రేషన్ల స్వీకరణకు ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
* అనివార్య కారణాలతో ఆలస్యం
వాస్తవానికి సీయూఈటీ యూజీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ తొలివారంలోనే ప్రారంభం కావాల్సి ఉంది. ఫిబ్రవరి తొలివారంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని గతంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. కానీ, అనివార్య కారణాల వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యమైంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే, ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. Cuet.samarth.ac.in. అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది.
* యథావిధిగా పరీక్షలు
గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పరీక్ష నిర్వహణ ఉండనుంది. సిలబస్, పరీక్షా విధానంలో ఎలాంటి మార్పులు లేవు. యథావిధిగా ప్రవేశ పరీక్ష జరగనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ధ్రువీకరించింది. ఆసక్తిగల అభ్యర్థులు గరిష్ఠంగా ఆరు సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. వీటితో పాటు ఒకటి లేదా రెండు లాంగ్వేజెస్‌ని సెలక్ట్ చేసుకోవచ్చు. జనరల్ టెస్ట్‌ని కూడా విద్యార్థులు రాయాల్సి ఉంటుంది. సీయూఈటీ యూజీ 2023 పరీక్షలు ఈ ఏడాది మే 21 నుంచి మే 31 వరకు జరగనున్నాయి. జూన్ మూడో వారంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి : ఎగ్జామినేషన్ క్యాలెండర్ రిలీజ్ చేసిన SSC.. CHSL టైర్ 1, CGL టైర్ 2 ఎప్పుడంటే?
* సిలబస్ ఏంటి?
సీయూఈటీ యజీ 2023 సిలబస్ పూర్తిగా 12వ తరగతిపైనే ఆధారపడి ఉంటుంది. ఇందులో నుంచే ప్రవేశ పరీక్షలో ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది. 11వ తరగతి సిలబస్ నుంచి ఒక్క ప్రశ్నను కూడా ఎగ్జామ్‌లో అడిగేందుకు ఆస్కారముండదు. అందుబాటులో ఉన్న 13భాషల్లో అభ్యర్థులు ఏదైనా ఒక లాంగ్వేజ్ పరీక్షను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం, హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, బెంగాళీ, ఒరియా, ఇంగ్లిష్ పరీక్షలలో ఏదైనా ఒక దానిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
* పరీక్షా విధానం
సీయూఈటీ యూజీ 2023 ప్రవేశ పరీక్షలో నాలుగు సెక్షన్‌లు ఉండనున్నాయి. Section IA- 13 లాంగ్వేజెస్, Section IB 20 లాంగ్వేజెస్, Section II- 27 డొమైన్ స్పెసిఫిక్ టాపిక్స్, Section III- జనరల్ టెస్ట్ ఉంటాయి.
* స్కోరు ఆధారంగా ప్రవేశాలు
సీయూఈటీ యజీ 2023 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు సెంట్రల్ వర్సిటీలలో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు ప్రైవేటు కళాశాలల్లో, డీమ్డ్ యూనివర్సిటీల్లోనూ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మార్కులు ఉపయోగపడతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Cuet, EDUCATION, JOBS