• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • NTA DU RECRUITMENT 2021 NATIONAL TESTING AGENCY REOPENS APPLICATION WINDOW FOR 1145 NON TEACHING POSTS IN DELHI UNIVERSITY SS

NTA Recruitment 2021: మొత్తం 1145 పోస్టుల భర్తీకి మళ్లీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

NTA Recruitment 2021: మొత్తం 1145 పోస్టుల భర్తీకి మళ్లీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

NTA Recruitment 2021: మొత్తం 1145 పోస్టుల భర్తీకి మళ్లీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)

NTA Recruitment 2021 | ఢిల్లీ యూనివర్సిటీలో 1145 పోస్టుల భర్తీకి మళ్లీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    నిరుద్యోగులకు శుభవార్త. ఢిల్లీ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA మళ్లీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. గతంలో ఢిల్లీ యూనివర్సిటీలో 1145 నాన్ టీచింగ్ పోస్టులతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌కు 2021 మార్చి 16 వరకు దరఖాస్తుల్ని స్వీకరించింది. ఇప్పుడు దరఖాస్తు విండోను మరోసారి రీఓపెన్ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. గతంలో దరఖాస్తు చేయలేకపోయినవారు 2021 ఏప్రిల్ 28 వరకు దరఖాస్తు చేయొచ్చు. గతంలో దరఖాస్తు చేసినవాళ్లు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ https://recruitment.nta.nic.in/ లేదా ఢిల్లీ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ http://www.du.ac.in/ చూడాలి. అప్లై చేయడానికి ముందు నోటిఫికేషన్ చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

    NTA DU Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 28 రాత్రి 11.50 గంటలు
    దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2021 ఏప్రిల్ 29
    దరఖాస్తులో తప్పులు సరిదిద్దుకోవడానికి- 2021 ఏప్రిల్ 30 నుంచి మే 2
    అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్- తేదీలను త్వరలో వెల్లడించనున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
    ఆన్‌లైన్ టెస్ట్- తేదీలను త్వరలో వెల్లడించనున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ

    Amazon Academy: జేఈఈ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఫ్రీ కోచింగ్ ఇస్తున్న అమెజాన్

    IAF Recruitment 2021: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 1,524 ఉద్యోగాలకు నోటిఫికేషన్... హైదరాబాద్‌లో ఖాళీలు

    NTA DU Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 1145
    జూనియర్ అసిస్టెంట్ - 236
    టెలిఫోన్ ఆపరేటర్ - 08
    అసిస్టెంట్ - 80
    స్టెనోగ్రాఫర్ - 77
    యోగా ఆర్గనైజర్ - 01
    సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ - 05
    నర్స్ - 07
    అసిస్టెంట్ మేనేజర్ గెస్ట్ హౌస్ - 01
    జూనియర్ ఇంజనీర్ సివిల్ - 05
    జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ - 05
    అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ - 04
    సీనియర్ అసిస్టెంట్ - 45
    హిందీ ట్రాన్స్‌లేటర్ - 02
    పర్సనల్ అసిస్టెంట్ - 09
    ప్రొఫెషనల్ అసిస్టెంట్ - 16
    సోషల్ వర్కర్- 03
    ఫిజియోథెరపిస్ట్ - 02
    ఎక్స్-రే టెక్నీషియన్ - 02
    హార్టికల్చరిస్ట్- 01
    సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ డిపార్ట్‌మెంట్ - 58
    అసిస్టెంట్ ఆర్కైవిస్ట్ - 01
    స్పోర్ట్ కోచ్ - 01
    సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ - 17
    ఫార్మసిస్ట్ - 05
    టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ - 19
    టెక్నికల్ అసిస్టెంట్ హెల్త్ సెంటర్ - 02
    స్టాటిస్టికల్ అసిస్టెంట్ - 2
    టెక్నికల్ అసిస్టెంట్ విభాగం - 51
    శానిటరీ ఇన్‌స్పెక్టర్ - 01
    తబ్లా సహచరులు - 12
    పఖావాజ్ ప్లేయర్ - 01
    సారంగి సహాయకులు - 02
    వయోలిన్ సహాయకులు - 02
    మృదంగం సహచరులు - 01
    హార్మోనియం సహాయకులు - 01
    తన్పుర సహచరులు - 04
    ల్యాబరేటరీ అసిస్టెంట్ - 53
    వర్క్ అసిస్టెంట్ - 03
    అసిస్టెంట్ స్టోర్ - 02
    సేల్స్ మాన్ DHMI- 02
    లైబ్రరీ అసిస్టెంట్ -05
    ప్రైవేట్ సెక్రెటరీ - 02
    సెక్యూరిటీ ఆఫీసర్ - 01
    జూనియర్ అసిస్టెంట్ స్టోర్ - 1
    జూనియర్ వర్క్ అసిస్టెంట్ (ఇంజనీరింగ్ సర్వీస్) - 35
    లైబ్రరీ అటెండెంట్ - 109
    హెల్త్ అటెండెంట్ - 18
    ల్యాబరేటరీ అటెండెంట్ - 152
    ఇంజనీరింగ్ అటెండెంట్ - 52
    మెడికల్ ఆఫీసర్ - 15
    అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 06

    Teacher Jobs: నిరుద్యోగులకు అలర్ట్... 3400 టీచర్ ఉద్యోగాలకు మొదలైన దరఖాస్తు ప్రక్రియ

    Bank Jobs 2021: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 150 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    NTA DU Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    విద్యార్హతలు- ఇంటర్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
    వయస్సు- పోస్టుల వారీగా అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకు వేర్వేరుగా ఉంది.
    ఎంపిక విధానం- ఆన్‌లైన్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్
    దరఖాస్తు ఫీజు- జనరల్, అన్‌రిజర్వ్‌డ్ అభ్యర్థులకు రూ.1000. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు