• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • NTA DU RECRUITMENT 2021 NATIONAL TESTING AGENCY INVITES APPLICATIONS FOR 1145 NON TEACHING POSTS IN DELHI UNIVERSITY KNOW HOW TO APPLY SS

NTA Recruitment 2021: ఇంటర్, డిగ్రీ, పీజీ పాస్ అయినవారికి 1145 జాబ్స్... అప్లై చేయండి ఇలా

NTA Recruitment 2021: ఇంటర్, డిగ్రీ, పీజీ పాస్ అయినవారికి 1145 జాబ్స్... అప్లై చేయండి ఇలా

NTA Recruitment 2021: ఇంటర్, డిగ్రీ, పీజీ పాస్ అయినవారికి 1145 జాబ్స్... అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

NTA Recruitment 2021 | నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఇంటర్, డిగ్రీ, పీజీ పాస్ అయినవారు ఈ 1145 పోస్టులకు అప్లై చేయొచ్చు. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

  • Share this:
    ఢిల్లీ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి 2021 మార్చి 16 వరకు అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1145 పోస్టుల్ని భర్తీ చేస్తోంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, పర్సనల్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ లాంటి పోస్టులున్నాయి. ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఆసక్తిగల అభ్యర్థులు NTA అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ https://recruitment.nta.nic.in/ లో అప్లై చేయాలి. అభ్యర్థులు అప్లై చేయడానికి ముందు నోటిఫికేషన్ చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. మరి ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

    DSSSB Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... 1809 ఉద్యోగాలకు అప్లై చేయండిలా

    ESIC Recruitment 2021: ఈఎస్ఐలో మెగా రిక్రూట్‌మెంట్... మొత్తం 6,552 ఖాళీలు

    NTA Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    అభ్యర్థులు ముందుగా https://recruitment.nta.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    DU Recruitment Test (Non - Teaching Posts) 2021 లింక్ పైన క్లిక్ చేయాలి.
    ఆ తర్వాత Apply for DU Recruitment Test (Non - Teaching Posts) 2021 పైన క్లిక్ చేయాలి.
    ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.
    ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి.
    Click here to Proceed పైన క్లిక్ చేయాలి.
    పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ లాంటి వివరాలతో రిజిస్టర్ చేయాలి.
    సిస్టమ్ జనరేట్ చేసిన అప్లికేషన్ నెంబర్ రాసిపెట్టుకోవాలి.
    ఆ తర్వాత ఫోటో, సంతకం, సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలి.
    చివరగా ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
    జనరల్, అన్‌రిజర్వ్‌డ్ అభ్యర్థులు రూ.1,000, ఓబీసీ, ఈ డబ్ల్యూఎస్, మహిళలు, ట్రాన్స్‌జెండర్స్ రూ.800, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.600 ఫీజు చెల్లించాలి.
    అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

    SSC MTS Recruitment 2021: టెన్త్ పాస్ అయ్యారా? ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా

    RBI Recruitment 2021: టెన్త్ పాస్ అయ్యారా? ఆర్‌బీఐలో 841 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకు అప్లై చేయండిలా

    ఆన్‌లైన్ దరఖాస్తు చేసే సమయంలో స్టెప్ 3, స్టెప్ 4 పూర్తి చేయడం మర్చిపోవద్దు. లేకపోతే దరఖాస్తు ఫామ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు 2021 మార్చి 16 రాత్రి 11.50 గంటల్లోగా అప్లై చేయాలి. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి 2021 మార్చి 17 చివరి తేదీ. దరఖాస్తులో తప్పులు సరిదిద్దుకోవడానికి 2021 మార్చి 18 నుంచి మార్చి 20 వరకు అవకాశం ఉంటుంది. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్, ఆన్‌లైన్ టెస్ట్ తేదీలను ఇంకా వెల్లడించలేదు.
    Published by:Santhosh Kumar S
    First published: