హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Entrance Exam Results: విద్యార్థులకు అలర్ట్.. ఆ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

Entrance Exam Results: విద్యార్థులకు అలర్ట్.. ఆ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్​ యూనివర్సిటీల్లో యూజీ (UG) ప్రవేశాల కోసం నిర్వహించే సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ CUCET UG -2022 పరీక్షకు హాజరైన విద్యార్థులకు అలర్ట్. ఈ పరీక్ష కు సంబంధించి ఫలితాలను విడుదల చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్​ యూనివర్సిటీల్లో యూజీ (UG) ప్రవేశాల కోసం నిర్వహించే సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ CUCET UG -2022 పరీక్షకు హాజరైన విద్యార్థులకు అలర్ట్. ఈ పరీక్ష కు సంబంధించి ఫలితాలను విడుదల చేశారు.  ఫలితాలను అధికారిక వెబ్ సైట్ cuet.samarth.ac.in లో చూసుకోవచ్చు. అభ్యర్థులు ఈ వెబ్ సైట్ నుంచి తమ స్కోర్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.  ఈ ఫలితాలను సెప్టెంబర్ 15 రాత్రి 10 గంటలకు విడుదల అవుతాయని యూజీసీ చైర్మన్ చెప్పారు. కానీ రాత్రి విడుదల కాలేదు. ఎట్టకేలకు సెప్టెంబర్ 16 ఉదయం ఈ ఫలితాలను విడుదల చేశారు. సీయూసెట్ లో సాధించిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులు యూనివర్సిటీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరో సారి సీయూసెట్-యూజీ కరెక్షన్ విండోను ఓపెన్ చేసింది.

TS CPGET Results: నేడు తెలంగాణ CPGET ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

విద్యార్థులు cuet.samarth.ac.in వెబ్ సైట్ ఓపెన్ చేసి తమ అప్లికేషన్ ఫామ్ లో వివరాలను సరి చేసుకోవచ్చు. యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ గత వారం మాట్లాడుతూ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీయూసెట్ యూజీ-2022 ఫలితాలను ఈ నెల 15వ తేదీలోపు విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. కుదిరితే మరో రెండు రోజుల ముందే ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. కానీ ఒక రోజు ఆలస్యంగా ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 14.90 లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా.. 9.68 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. 19,865 మంది అభ్యర్థులు 30 సబ్జెక్టులలో 100 పర్సంటైల్ సాధించారు.

ఉత్తరప్రదేశ్ లో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 2,92,589 మంది విద్యార్థులు CUETకి హాజరయ్యారు. ఢిల్లీలో 1,86,405 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా.. 84,425 మందితో బీహార్ రెండో స్థానంలో నిలిచింది . మేఘాలయలో 5,634 మంది నమోదిత అభ్యర్థులలో 583 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు, CUET UGలో మొత్తం 61.86 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ప్రవేశ పరీక్ష భారతదేశంలోని 547 నగరాల్లో , భారతదేశం వెలుపల ఉన్న 13 నగరాల్లో - శ్రీలంక, ఖతార్, దోహా, ఇండోనేషియా, నేపాల్, మలేషియా, బహ్రెయిన్, కువైట్, నైజీరియా, ఒమన్, సౌదీ అరేబియా, షార్జా మరియు సింగపూర్ ఈ పరీక్షను నిర్వహించారు.

Telangana Jobs: అభ్యర్థుల ఆందోళనతో.. తెలంగాణలో మరో రిక్రూట్ మెంట్ రద్దు..

స్కోర్‌కార్డ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేయాలి.

-CUET అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి cuet.samarth.ac.in.

-హోమ్ పేజీలో, CUET UG 2022 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి

-తదుపరి విండోలో NTA CUET అప్లికేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీతో సహా ఆధారాలను నమోదు చేయండి

-CUET UG 2022 ఫలితాన్ని క్లిక్ చేసి యాక్సెస్ చేయండి

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, CUCET 2022, Cuet, CUET 2022, Exam results, JOBS