NTA CONDUCT COMMON UNIVERSITY ENTRANCE TEST FOR ALL CENTRAL UNIVERSITIES UMG GH
CUET: సీయూఈటీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలు ఎప్పటి నుంచి అంటే..?
ప్రతీకాత్మక చిత్రం
దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(CUET) నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తాజాగా షెడ్యూల్‌ను ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లో (Central University) ప్రవేశాల కోసం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(CUET) నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే పరీక్ష (Exam) నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తాజాగా షెడ్యూల్‌ను ప్రకటించింది. సీయూఈటీ పరీక్షలను జులై 15, 16, 19, 20.. ఆ తరువాత ఆగస్టు 4, 5, 6, 7, 8, 10 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. CUET మొదటి ఎడిషన్ ద్వారా 300కి పైగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. పరీక్ష కంప్యూటర్ మోడ్‌లో జరగనుంది. జులై 17న నీట్-యూజీ పరీక్ష జరగనుండడంతో ఆ రోజు సీయూఈటీ పరీక్ష ఉండదని ఎన్టీఏ స్పష్టం చేసింది. మరోపక్క JEE (మెయిన్) పరీక్షల కారణంగా జులై 21 నుంచి ఆగస్టు 3 మధ్య కూడా సీయూఈటీ పరీక్షలు ఉండవు.
సీయూఈటీ మొదటి ఎడిషన్‌కు దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష దేశంలోని 554 నగరాల్లో, విదేశాల్లోని 13 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఒక్కో అభ్యర్థికి గరిష్టంగా సీయూఈటీ తొమ్మిది పేపర్లు రాయడానికి అనుమతి ఇచ్చారు. సీయూఈటీ మొత్తంగా 54వేల సబ్జెక్ట్ కాంబినేషన్లతో అత్యంత భారీ ప్రవేశ పరీక్ష కానుంది. ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూతో సహా మొత్తం 13 భాషల్లో సీయూఈటీని నిర్వహించనున్నారు. అలాగే 33 లాంగ్వేజ్ సబ్జెక్ట్స్, 27 యూనిక్ సబ్జెక్టుల కాంబినేషన్లో దేనినైనా ఎంపిక చేసుకోవచ్చు.
కాగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) 45 సెంట్రల్ యూనివర్సిటీలలో ప్రవేశాలకు సీయూఈటీ-యూజీ స్కోర్స్ తప్పనిసరి అని మార్చిలో ప్రకటించింది. అలాగే కొన్ని సెంట్రల్ యూనివర్సిటీలు ప్రవేశాల కోసం కనీస అర్హత ప్రమాణాలను నిర్ణయించడానికి యూజీసీ అనుమతులిచింది. సీయూఈటీ ద్వారా ఢిల్లీ యూనివర్సిటీకి అత్యధికంగా 6 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. బెనారస్ హిందూ యూనివర్సిటీకి దాదాపు 3.94 లక్షలు, అలహాబాద్ యూనివర్సిటీకి 2.31 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
* గుర్తుంచుకోవాల్సిన విషయాలు
CUET-2022 కోసం సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు కొన్ని కీలక విషయాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
* సిలబస్‌పై పూర్తి అవగాహన
పరీక్ష మూడు భాగాలుగా ఉంటుంది. మొదటి సెక్షన్లో లాంగ్వేజ్‌లు ఉంటాయి. రెండో సెక్షన్లో స్పెసిఫిక్ డొమైన్ సబ్జెక్టులు ఉంటాయి. చివరిది మూడో సెక్షన్ జనరల్ ఎబిలిటీపై ఉంటుంది. ప్రతి విభాగం నుంచి ప్రశ్నలను ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 12వ తరగతికి చెందిన NCERT సిలబస్ ఆధారంగా పరీక్షలో ప్రశ్నలు ఉండనున్నాయి.
కాగా, సీయూఈటీ మొట్టమొదటిసారిగా ఈ ఏడాది నుంచి నిర్వహిస్తున్నారు. దీంతో ఈ పరీక్ష అందరికీ కొత్తగా అనిపిస్తుంది. ఈ కారణంగా విద్యార్థులు కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. దీన్ని నివారించాలంటే పరీక్ష సిలబస్‌పై పూర్తి దృష్టి పెట్టండి. NCERT పుస్తకాల ప్రిపరేషన్‌తో పరీక్షకు సిద్ధంగా ఉండండి. సిలబస్‌పై పూర్తి అవగాహన ఉంటే పరీక్ష ఎలా ఉన్నా ఈజీగా ఎదుర్కొవచ్చు.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.