Home /News /jobs /

NTA CALENDAR 2022 SOON JEE MAIN REGISTRATIONS EXPECTED IN JANUARY NEET LIKELY IN JULY GH VB

JEE Main 2022G: జేఈఈ మెయిన్‌ నోటిఫికేషన్‌, నీట్ ఎగ్జామ్​.. ఎంట్రన్స్​ టెస్ట్​​​ క్యాలెండర్​పై ఎన్​టీఏ కసరత్తు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

2022లో జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షల తేదీలు, నోటిఫికేషన్లు, అప్లికేషన్‌ ఫామ్‌ రిలీజ్‌ తేదీ తదితర వివరాలతో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్​టీఏ) క్యాలెండర్‌ సిద్దం చేస్తోంది. వైద్యవిద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్​ ప్రవేశ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) జూన్‌లో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
2022లో జాతీయ స్థాయిలోనిర్వహించే పరీక్షల తేదీలు, నోటిఫికేషన్లు, అప్లికేషన్‌ ఫామ్‌ రిలీజ్‌ తేదీ తదితరవివరాలతో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్​టీఏ) క్యాలెండర్‌ సిద్దం చేస్తోంది.వైద్యవిద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్​ ప్రవేశ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) జూన్‌లో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష JEE మెయిన్‌ నోటిఫికేషన్‌ వచ్చే నెలలోనే వెలువడే సూచనలున్నాయి. అయితే, ఈ పరీక్షల తేదీలు, నోటిఫికేషన్‌ తేదీలను ఎటీఏ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాని, అన్ని ముఖ్యమైన పరీక్షలకు సంబంధించి క్యాలెండర్‌ను మాత్రం సిద్దం చేస్తోంది.గతేడాది నిర్వహించనట్లుగానే ఈసారి జీఈఈమెయిన్‌, నీట్​పరీక్షలనుఛాయిస్‌తో కూడిన కొత్త ఎగ్జామ్‌ ప్యాటన్‌లోనే నిర్వహించనుంది.

TS Inter Results 2021: ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో భారీగా తగ్గిన పాస్ పర్సంటేజ్.. ఫెయిలైన వారిని పాస్ చేస్తారా?

అయితే, జేఈఈమెయిన్ 2022 విద్యార్థులకు ఇంటర్నల్‌ ఛాయిస్‌ ఇవ్వనుంది. కరోనాతో విద్యాసంస్థల మూసివేత కారణంగా సిలబస్‌ను బోర్డులు తగ్గించడంతో ఈ ఏర్పాటు చేసింది. 2021లో నిర్వహించిన తరహాలోనే 2022లోనూ మెయిన్‌ ఎగ్జామ్‌ రెండుసార్లు ఉంటుంది. నీట్​ 2022కు కూడా ఇంటర్నల్‌ ఛాయిస్‌ గతేడాది లాగే కొనసాగుతుంది. నీట్​మెడిసిన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌లో 200 ప్రశ్నలు ఉంటాయి. వీటికి మార్కులు 720. ఈ ప్రశ్నలకు 180 నిమిషాలు అంటే 3 గంటల్లోపు సమాధానాలు ఇవ్వాలి. కాని ఛాయిస్‌ విధానంలో 180 ప్రశ్నలకు విద్యార్థులు సమాధానం ఇస్తే సరిపోతుంది. ఈ ఇంటర్నల్‌ ఛాయిస్‌ విధానాన్ని2021లో తొలిసారి ప్రవేశపెట్టారు. జేఈఈ మెయిన్‌ తరహాలోనే నీట్​ను కూడా రెండుసార్లు నిర్వహించాలని ఎన్​టీఈ యోచిస్తోంది. దీనిపై నిపుణులతోచర్చలు జరుగుతున్నాయి. కాని, దీనిపై విద్యా, ఆరోగ్య మంత్రిత్వశాఖల ఒక నిర్ణయం ఇంకా లేదా లేదు.ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని చూస్తే నీట్​–2022ఒకసారి మాత్రమే జరిగే అవకాశం ఉంది.

BSNL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. BSNLలో 55 ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

త్వరలోనే ఎంట్రన్స్​ ఎగ్జామ్​ క్యాలెండర్​ విడుదల..
ఈ కీలక పరీక్షలే కాకుండా సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశం కోసం సీయూసెట్​నుకూడా ఎన్​టీఏ నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తుంది. మరోవైపు, ఈ పరీక్షను అంగీకరించే యూనివర్సిటీల సంఖ్య కూడా పెరగనుంది. ఢిల్లీ యూనివర్సిటీ కూడా దీనికి అంగీకరించనుందని సమాచారం. నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాతే అన్ని వివరాలు తెలియజేస్తుంది. ఎన్​టీఏరూపొందిస్తున్న క్యాలెండర్‌లో ఈ పరీక్షలు, వాటి షెడ్యూల్‌ వివరాలన్నీ ఉండనున్నాయి.

2022 సంవత్సరానికి సంబంధించిన ఈ పరీక్ష క్యాలెండర్‌లో నోటిఫికేషన్‌ విడుదల తేదీ, అప్లికేషన్‌ ఫామ్స్, అడ్మిట్‌ కార్డులు, ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్ నిర్వహించే తేదీల వివరాలన్ని పొందుపర్చనుంది. జాతీయ స్థాయిలో నిర్వహించి ప్రవేశ పరీక్షలు అంటే అండర్‌ గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లకు జేఈఈ మెయిన్, వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నీట్​ను ఎన్​టీఏ నిర్వహిస్తుంది. అంతే కాదు సీయూసెట్​, యూజీసీ నెట్​, సీఎస్​ఐఆర్​,నెట్​,జేఎన్​యూ, డీయూ ప్రవేశపరీక్షలను కూడా నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్​టీఏ) నిర్వహణలోనే జరుగుతాయి.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Veera Babu
First published:

Tags: Jee, JEE Main 2021

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు