Home /News /jobs /

NSE ACADEMY HDFC MUTUAL FUND LAUNCH FINANCIAL AWARENESS PROGRAMME FOR COLLEGE STUDENTS HERE DETAILS NS GH

Financial Awareness: ఫైనాన్షియల్ అవేర్‌నెస్‌పై ఆన్‌లైన్ ప్రోగ్రామ్.. NSE అకాడమీ, HDFC మ్యూచువల్ ఫండ్ ఆధ్వర్యంలో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కాలేజీ విద్యార్థుల కోసం NSE అకాడమీ లిమిటెడ్ (NAL), HDFC మ్యూచువల్ ఫండ్ కలిసి స్పెషల్ ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాయి. ‘ఇన్వెస్ట్‌వర్స్: యాన్ ఇంట్రడక్షన్ టు ది వరల్డ్ ఆఫ్ ఇన్వెస్టింగ్’ పేరుతో ఆర్థిక విషయాలపై అవగాహన పెంపొందించే కోర్సును లాంచ్ చేశాయి.

ఇంకా చదవండి ...
కాలేజీ విద్యార్థుల కోసం NSE అకాడమీ లిమిటెడ్ (NAL), HDFC మ్యూచువల్ ఫండ్ కలిసి స్పెషల్ ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాయి. ‘ఇన్వెస్ట్‌వర్స్: యాన్ ఇంట్రడక్షన్ టు ది వరల్డ్ ఆఫ్ ఇన్వెస్టింగ్’ పేరుతో ఆర్థిక విషయాలపై అవగాహన పెంపొందించే కోర్సును లాంచ్ చేశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన NSE అకాడమీ లిమిటెడ్.. ఈ ప్రోగ్రామ్ కోసం HDFC అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (HDFC AMC)తో ఒప్పందం కుదుర్చుకుంది. తొమ్మిది గంటల పాటు నిర్వహించే ఈ కోర్సు ద్వారా ఫస్ట్ టైమ్ ఇన్వెస్టర్స్‌కు అవగాహన కల్పించనున్నారు. ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ ప్రోగ్రామ్ HDFC మ్యూచువల్ ఫండ్ MFBytes అప్లికేషన్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. ఇది అప్లికేషన్ బేస్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్.

HDFC AMC ఎండీ నవనీత్ మునోత్ మాట్లాడుతూ.. “ ఈ కోర్సు ద్వారా పెద్ద సంఖ్యలో విద్యార్థులను చేర్చుకోవడమే కాకుండా, తెలివైన ఆర్థిక నిర్ణయాలను తీసుకునేలా వారికి ప్రాథమిక ఆర్థిక పరిజ్ఞానాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి భారతీయుడు వెల్త్ క్రియేటర్‌గా ఎదగడం కోసం ఈ ప్రోగ్రామ్‌ను చేపడుతున్నాం.’’ అని చెప్పారు.

HDFC AMC ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్యామలి బసు మాట్లాడుతూ... ప్రస్తుత కాలంలో ఆర్థిక విషయాల్లో ప్రణాళిక బద్ధంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలమని, అందుకు ఆర్థిక విషయాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. అలాగే పర్సనల్ ఫైనాన్స్‌కు సంబంధించిన ప్రాథమిక విషయాలపై పరిజ్ఞానం కూడా ఎంతో కీలకమన్నారు. అదే సమయంలో సాఫ్ట్ స్కిల్స్‌ను కూడా అభివృద్ధి చేసుకోవాలని బసు అభిప్రాయపడ్డారు. పర్సనల్ ఫైనాన్స్‌ నైపుణ్యాన్ని పెంచుకోవడం, అందుకు అవసరమైన శిక్షణ పొందడం, తద్వారా విద్యార్థులు ప్రపంచాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడమే ఈ కోర్సు లక్ష్యమని బసు తెలిపారు.

మరోవైపు, ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ Uable 16 నుంచి 18 ఏళ్ల యువతలో స్కిల్స్ డెవలప్ చేసి, భవిష్యత్తు ఎంటర్ ప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దడం కోసం ‘క్యాంపస్ అంబాసిడర్ ప్రోగ్రామ్’కు శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో వ్యాపారవేత్తలుగా ఎదగడానికి, సొంతంగా మినీ సోషల్ మీడియా నెట్‌వర్క్ ప్రారంభించడం కోసం ఈ ప్రోగ్రామ్‌ ద్వారా టీనేజ్ అంబాసిడర్లను ఎంపిక చేయనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 1000 మంది విద్యార్థులను ఈ ప్రోగ్రామ్ కోసం చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు Uable ప్రకటించింది.

ఎంపికైన టీనేజ్ అంబాసిడర్లను టాప్ స్టార్టప్ కంపెనీల మెంటర్లతో కనెక్ట్ చేయనున్నట్లు ఎడ్‌టెక్ సంస్థ తెలిపింది. భవిష్యత్తులో ఇంటర్న్ షిప్‌లు లేదా ఫెలోషిప్లకు ప్రాధాన్యత క్రమంలో యాక్సెస్ పొందడానిని ఈ కార్యక్రమం దోహదపడుతుందని Uable తెలిపింది. పాఠశాలలు, కళాశాలలు, ఇతర సంస్థల్లోని టీనేజ్ కమ్యూనిటీలను యూబుల్ వేదికగా ఒకచోట చేర్చడం ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. ఈ మైక్రో టీనేజ్ కమ్యూనిటీలు... తమ స్నేహితులు, పూర్వ విద్యార్థులను కలుసుకోవడానికి Uable యాప్‌‌ను ఉపయోగించుకోవచ్చు. కంటెంట్ షేర్ చేసుకోవడం, సవాళ్లను చర్చించి కలిసి అధ్యయనం చేయడానికి కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Career and Courses, Hdfc, Mutual Funds

తదుపరి వార్తలు