భారతీయ రైల్వే మాత్రమే కాదు... రైల్వేకు చెందిన పలు సంస్థలు కూడా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటాయి. నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్స్టిట్యూట్-NRTI పలు ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఇది కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఈ విద్యా సంస్థలో నాన్-టీచింగ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 8 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.nrti.edu.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. కాంట్రాక్ట్ గడువు మూడేళ్లు ఉంటుంది.
చీఫ్ అడ్మిషన్ అండ్ ఔట్రీచ్ ఆఫీసర్
డైరెక్టర్ (ఎగ్జిక్యూటీవ్ ఎడ్యుకేషన్)
డైరెక్టర్ (స్కిల్ డెవలప్మెంట్)
చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్
హ్యూమన్ రీసోర్స్ ఆఫీసర్
స్టూడెంట్స్ యాక్టివిటీస్ ఆఫీసర్
కమ్యూనికేషన్ ఆఫీసర్
డిప్యూటీ వార్డెన్
అడ్మిన్ అసిస్టెంట్
ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ లేదా యోగా ట్రైనర్
ల్యాబరేటరీ అసిస్టెంట్
ల్యాబరేటరీ టెక్నీషియన్
High Court Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని హైకోర్టులో ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ
CET: విద్యార్థులకు అలర్ట్... ఈ ఏడాది ఆ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉండదు
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 7
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 8
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు.
వయస్సు- అభ్యర్థుల గరిష్ట వయస్సు పోస్టుల వారీగా వేర్వేరుగా ఉంది.
Indian Navy Jobs 2021: ఇండియన్ నేవీలో జాబ్స్... పరీక్ష లేదు... విశాఖపట్నంలో ఇంటర్వ్యూలు
TCS National Qualifier Test: కార్పొరేట్ కంపెనీలో జాబ్ మీ కలా? మీ ఇంటి నుంచే ఈ ఎగ్జామ్ రాయండి
అభ్యర్థులు https://www.nrti.edu.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో Careers లో Active Recruitments పైన క్లిక్ చేయాలి.
Notice for Recruitment to Non-Teaching Positions లింక్ కనిపిస్తుంది. View పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో భర్తీ చేస్తున్న పోస్టుల వివరాలు ఉంటాయి.
ప్రతీ పోస్ట్ పక్కన Click Here లింక్ కనిపిస్తుంది.
అభ్యర్థులు ఏ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పోస్టు పక్కన ఉన్న Click Here పైన క్లిక్ చేయాలి.
పేరు, అడ్రస్, పుట్టిన తేదీ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.
ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి.
విద్యార్హతలు, అనుభవం లాంటి వివరాలు కూడా ఎంటర్ చేయాలి.
చివరగా సబ్మిట్ క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Upcoming jobs