ఐఐటీ, ఐఐఎస్సీ సహకారంతో ఎన్పీటీఈఎల్ 593 ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 31లోపు www.swayam.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీలో(Technology) సైతం అనేక మార్పులు వస్తున్నాయి. కొత్త టెక్నాలజీలపై పట్టు సాధించిన వారికే ఉద్యోగాలు దక్కుతున్నాయి. అందుకే, ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎస్సీ వంటి విద్యాసంస్థలు కొత్త కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఆయా కోర్సులను నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ (NPTEL) భాగస్వామ్యంతో ఉచితంగానే అందిస్తున్నాయి. ఐఐటీ, ఐఐఎస్సీ సహకారంతో ఎన్పీటీఈఎల్ 593 ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 31లోపు www.swayam.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ కోర్సులను ఇంజనీరింగ్, సైన్సెస్, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ స్ట్రీమ్‌లలో ఉచితంగానే అందజేస్తుంది. అంతేకాదు, గ్రామీణ విద్యార్థులు సైతం ఐటీ సెక్టార్లో ఉద్యోగాలు దక్కించుకునేలా కోర్సులను డిజైన్ చేసింది.
ఈ కోర్సులను ఐఐటీ, ఐఐఎస్సీ ఫ్యాకల్టీ సభ్యులు బోధిస్తారు. స్వయం ఎన్పీటీఈఎల్ పోర్టల్ ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులకు డేటా సైన్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్, పైథాన్, జావా, సి, సి++ వంటి ప్రోగ్రామింగ్ కోర్సులను ఉచితంగానే అందిస్తారు. కాగా, 2022 జనవరి సెమిస్టర్ నుంచి హిందుస్థానీ సంగీతం, రీసెర్చ్ మెథడాలజీ, ఆర్నిథాలజీ, డెంటల్ విద్యార్థుల కోసం ఓరల్ బయాలజీ, ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం బ్లాక్‌చెయిన్, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్ వంటి కోర్సులను కొత్తగా ప్రారంభించింది. అంతేకాదు, తమిళం, హిందీ భాషల్లో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కోర్సును కూడా ప్రారంభించింది.
ఐఐటీ ప్రొఫెసర్లతో ఉచిత శిక్షణ..
ఫ్యాకల్టీల లైవ్ ఇంటరాక్టివ్ సెషన్ల ద్వారా NPTEL వీడియో లెక్చర్లు, అసైన్మెంట్లు, క్లాసులు ఉంటాయి. లెర్నర్స్ అభిరుచి మేరకు గ్రూప్ డిస్కషన్స్‌లో పాల్గొనవచ్చు. ఈ కోర్సుల్లో చేరేందుకు ఎటువంటి గరిష్ట వయోపరిమితి లేదా అర్హత అవసరం లేదు. ఏ వయస్సులో వారైనా నచ్చిన కోర్సులో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
NPTEL గ్రామీణ భారతదేశంలోని విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ వంటివి కూడా ఆఫర్ చేస్తుంది. NPTEL కోర్సు సర్టిఫికేషన్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుంది. NPTEL ప్రకారం, ఇప్పటివరకు 1.58 కోట్ల మంది లెర్నర్లు అనేక కోర్సుల్లో నమోదు చేసుకున్నారు. అయితే, కోర్సు పూర్తయిన తర్వాత పరీక్ష రాయాల్సి ఉంటుంది. దీనికోసం నామమాత్రపు ఫీజు చెల్లించాలి. ఈ పరీక్షను భారతదేశంలోని 150 కంటే ఎక్కువ నగరాల్లో నిర్వహిస్తారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.