హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NPCIL Recruitment 2021: ఆ ప్రముఖ సంస్థలో 200 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

NPCIL Recruitment 2021: ఆ ప్రముఖ సంస్థలో 200 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తోంది. తాజాగా సంస్థ నుంచి మరో జాబ్స్ నోటిఫికేషన్ విడుదలైంది.

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తోంది. తాజాగా సంస్థ నుంచి మరో జాబ్స్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 200 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 2018, 2019, 2020 ఏళ్లలో అభ్యర్థులు GATE స్కోర్ సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ గతేడాదే విడుదలైనా.. కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. ఎంపికైన అభ్యర్థులు ఎగ్జిక్యూటీవ్ ట్రైనీలుగా విధుల్లో చేరాల్సి ఉంటుంది. అనంతరం వారు లెవల్ 10 పే స్కేల్ కు అర్హత పొందుతారు. ఆ సమయంలో వారికి నెలకు రూ. 56,100 వేతనం చెల్లిస్తారు.

ఎవరు అప్లై చేయాలంటే..

2018, 2019 మరియు 2020 సంవత్సరాల్లో వ్యాలిడ్ గేట్ స్కోర్లు ఉండి, ఈ క్రింది ఇంజనీరింగ్‌ విభాగాల్లో కనీసం 60% మొత్తం మార్కులతో బీఈ, బీటెక్ లేదా బీఎస్సీ లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ విభాగంలో 85 ఖాళీలు, కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో 20, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లో 40, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ లో 8, ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో ఏడు, సివిల్ ఇంజనీరింగ్ లో 35, హెల్త్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్, ఫైర్ అండ్ సేఫ్టీ, సేఫ్టీ అండ్ ఫైర్ సేఫ్టీ, ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ లో 5 ఖాళీలు ఉన్నాయి.

Notification-Direct Link

ఎలా అప్లై చేయాలంటే..

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 9 వరకు ఆన్లైన్లో అప్లై చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇంటర్వ్యూలను ఏప్రిల్ 12 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు రూ. 500 వరకు అప్లికేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. కొందరికి ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

First published:

Tags: CAREER, Govt Jobs 2021, JOBS

ఉత్తమ కథలు