Home /News /jobs /

NPCIL RECRUITMENT 2021 APPLICATIONS INVITING FOR 72 JOB VACANCIES HERE FULL DETAILS NS

NPCIL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో భారీ వేతనంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. మొత్తం 72 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో (notification) స్పష్టం చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 72 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. NPCIL యొక్క నరోరా అటామిట్ పవర్ స్టేషన్ లో ఈ ఖాళీలను (Jobs) భర్తీ చేస్తున్నారు. స్టైఫండరీ ట్రైనీ, ఫార్మసిస్ట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, అసిస్టెంట్, నర్స్, Steno విభాగాల్లో ఈ నియామకాలను చేపట్టారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 44,900 వరకు వేతనం చెల్లించనున్నారు. ట్రైనీ ఖాళీలకు ఎంపికైన వారిని రెగ్యులర్ చేసే అవకాశం ఉన్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు..




































    పోస్టుఖాళీలు
    నర్స్ A5
    స్టైఫండరీ ట్రైనీ51
    ఫార్మసిస్ట్ B1
    అసిస్టెంట్ గ్రేడ్-112
    స్టెనో(Steno) గ్రేడ్-12
    ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ (Technician/B)1
    మొత్తం72

    విద్యార్హతల వివరాలు
    నర్స్-A: నర్సింగ్ లో డిప్లొమా చేసిన వారు లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు ఈ ఖాళీఅకు అప్లై చేసుకోవచ్చు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    స్టైఫండరీ ట్రైనీ: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    AP Model Scholl Jobs: నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త.. మోడల్ స్కూళ్లలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు

    ఫార్మసిస్ట్/B: ఫార్మసీలో డిప్లొమా, ఫార్మసీలో మూడేళ్ల ట్రైనింగ్ తో పాటు సెంట్రల్ ఫార్మసీ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్(Technician/B): ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ విభాగంలో ఏడాది కోర్సు చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    స్టేనో గ్రేడ్ 1: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచలర్ డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    IOCL Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. IOCLలో 300 ఖాళీలు.. ఇలా అప్లై చేసుకోండి

    ఎలా అప్లై చేయాలంటే..
    Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ (https://npcilcareers.co.in/MainSite/default.aspx) ఓపెన్ చేయాలి.
    Step 2: హోం పేజీలో Recruitment of Paramedical, Stipendiary Trainee & Non-Technical Posts at NAPS View details (Advt) పేరుతో లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
    Step 3: తర్వాత Apply ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
    Step 4: అనంతరం Online Registration, Login అనే ఆప్షన్లు కనిపిస్తాయి. మొదట Online Registration ఆప్షన్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
    CISF Recruitment 2021: CISF ఉద్యోగాల భర్తీకి UPSC నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి


    Step 5:
    మొదట రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి సూచించిన వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
    Step 6: అనంతరం యూజర్ నేమ్, పాస్వర్డ్ తదితర వివరాలతో లాగిన్ అవ్వాలి.
    Step 7: అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
    భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను భద్రపరుచుకోవాలి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు