న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 91 ట్రేడ్ అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
ట్రేడ్ల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..
ట్రేడ్ పేరు | ఖాళీలు |
కార్పెంటర్ | 2 |
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ | 11 |
డ్రౌట్స్మెన్(సివిల్) | 3 |
డ్రౌట్స్మెన్(మెకానికల్) | 2 |
ఎలక్ట్రీషియన్ | 14 |
ఎలక్ట్రానిక్ మెకానిక్ | 6 |
ఫిట్టర్ | 21 |
ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ | 6 |
ల్యాబరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ | 5 |
Mason Building Contractor | 3 |
మెషినిస్ట్ | 4 |
ప్లంబర్ | 2 |
టర్నర్ | 5 |
వెల్డర్ | 7 |
-ఐటీఐ కోర్సులో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇప్పటికే అప్రంటీస్ గా పని చేసిన వారి దరఖాస్తులు తిరస్కరించబడతాయని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
Jobs in AP: ఏపీలో డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హతతో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి
అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దరఖాస్తుకు ఆఖరి తేదీ: మార్చి 2.
Govt jobs 2022: 389 ఉద్యోగాలకు పరీక్ష లేదు.. నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ.. అర్హతలు ఇవే!
ఎలా అప్లై చేయాలంటే:
-అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://apprenticeship.gov.in పోర్టల్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
-అప్లై చేసుకున్న అనంతరం ఆ దరఖాస్తుల హార్డ్ కాపీని Madras Atomic Power Station, NPCILచిరునామాకు మార్చి 2 లోగా చేరేలా పంపించాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
-అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.