Home /News /jobs /

NOW TECHNOLOGICAL UNIVERSITY FOR INDIAN STUDENTS IN IRELAND 8 CAMPUSES FORMED FOR OVER 21000 STUDENTS GH VB

Technological University: ఆ దేశంలో ఇండియన్ స్టూడెంట్స్ కోసం టెక్నోలాజికల్‌ యూనివర్సిటీ.. వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆ దేశంలో భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేక టెక్నోలాజికల్‌ వర్సిటీ అందుబాటులోకి వచ్చింది. మూడు ప్రసిద్ధ యూనివర్సిటీల కలయికతో ఏర్పడిన మల్టీ క్యాంపస్‌ యూనివర్సిటీ ద్వారా వేల మంది విద్యార్థులకు వందల కోర్సులను అందిస్తున్నారు.

ఐర్లాండ్‌లోని(Ireland) భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేక టెక్నోలాజికల్‌ వర్సిటీ(Technological University) అందుబాటులోకి వచ్చింది. మూడు ప్రసిద్ధ యూనివర్సిటీల కలయికతో ఏర్పడిన మల్టీ క్యాంపస్‌ యూనివర్సిటీ(Campus University) ద్వారా వేల మంది విద్యార్థులకు వందల కోర్సులను అందిస్తున్నారు. గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(Post Graduation) కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఐర్లాండ్‌, ప్రపంచ వ్యాప్తంగా మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంబంధిత వర్సిటీలు పేర్కొంటున్నాయి. లెర్నింగ్‌ను(Learning) సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా గాల్వే మాయో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (GMIT), లెటర్‌కెన్నీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (LYIT), అట్లాంటిక్ టెక్నలాజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని IT స్లిగో అనే మూడు విశ్వవిద్యాలయాలు కలిసి భారతీయ విద్యార్థుల కోసం మల్టి క్యాంపస్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాయి. అట్లాంటిక్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (ATU) 21,000 మంది విద్యార్థులకు సేవలు అందిస్తోంది. ఐర్లాండ్ నార్త్‌ వెస్ట్‌లో ఎనిమిది క్యాంపస్‌లు, పరిశోధన కేంద్రాలు, iHubల ద్వారా 600 కంటే ఎక్కువ ఉన్నత విద్యా కోర్సులను అందిస్తుంది.

మూడు విశ్వవిద్యాలయాల కలయిక భారతీయ విద్యార్థులకు ఎక్కువ నేర్చుకొనే అవకాశాలను అందిస్తుంది. అకడమిక్‌ స్ట్రెంత్‌, గ్లోబల్‌ ఆపర్చునిటీస్‌, రీసెర్చ్‌, ఇన్నోవేషన్‌ వంటి అనేక కీలక రంగాలలో భారత విద్యార్థులకు గొప్ప లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ లభిస్తుందని ఇన్‌స్టిట్యూట్‌ ఓ మీడియా ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా ATU భారతీయ విద్యార్థులకు విశ్వవిద్యాలయం సాంస్కృతిక, విద్యాపరమైన ఫ్రేమ్‌వర్క్‌కు సహకరించే అవకాశాన్ని కూడా అందిస్తుంది.

US Graduate Study: యూఎస్‌లో గ్రాడ్యుయేట్ కోర్సులతో ఎన్నో ప్రయోజనాలు.. విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..


కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్‌ ఎగుమతిలో ప్రపంచంలో రెండో స్థానంలో ఐర్లాండ్ ఉంది. టాప్ 10 గ్లోబల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలలో తొమ్మిది సంస్థలకు ఐర్లాండ్‌లో బలమైన పునాదులు ఉన్నాయి. ఇంటెల్‌(Intel), హెచ్‌పీ(HP), ఐబీఎం(IBM), మైక్రోసాఫ్ట్‌(Microsoft), అప్లై(Apply) వంటి గ్లోబల్ లీడర్‌లు గూగుల్‌(Google), ఫేస్‌బుక్‌(Facebook), లింక్డ్‌ఇన్‌(LinkedIn), అమెజాన్‌(Amazon), పేపాల్‌(PayPal), ఈబే(eBay), ట్విట్టర్‌(Twitter) వంటి సరికొత్త ప్రముఖ దిగ్గజ సంస్థలు ఐర్లాండ్‌లో సుదీర్ఘకాలంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

అట్లాంటిక్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (ATU)లో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు STEM సంబంధిత ప్రోగ్రామ్‌లను చదువుతున్నారు. ఈ ప్రోగ్రామ్‌ల నుంచి భారతీయ గ్రాడ్యుయేట్లు తమ అధ్యయనాలను పూర్తి చేసిన తర్వాత ఉన్నత స్థాయి వృత్తిపరమైన ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. ఐర్లాండ్‌లోని చాలా మంది స్టే బ్యాక్ ఆప్షన్ (1G)ని ఉపయోగించుకుంటున్నారు లేదా న్యూ ఎంప్లాయర్‌ సహాయంతో వర్క్‌ పర్మిట్‌ను సెక్యూర్‌ చేసుకుంటున్నారు.

మూడు యూనివర్సిటీల కలయిక మల్టి క్యాంపస్‌ యూనివర్సిటీ గురించి ఐర్లాండ్‌లోని ఎడ్యుకేషన్ రీజినల్ మేనేజర్ - ఇండియా, సౌత్ ఏసియా బారీ ఓడ్రిస్కాల్ వివరిస్తూ.. “అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు ఐర్లాండ్, ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ కెరీర్ అవకాశాలు అందుకుంటారు’ అని చెప్పారు.
Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Career and Courses, Students, Technological

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు