హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఈ వారం అప్లై చేసుకోవాల్సిన జాబ్‌ నోటిఫికేషన్‌ల లిస్ట్‌ మీ కోసం..

Jobs: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఈ వారం అప్లై చేసుకోవాల్సిన జాబ్‌ నోటిఫికేషన్‌ల లిస్ట్‌ మీ కోసం..

ప్రస్తుతం నిరుద్యోగులకు అవకాశాలను ఇస్తూ.. వివిధ రకాల నోటిఫికేషన్‌లు వరుసగా విడుదలవుతున్నాయి. ఈ వారం అభ్యర్థులు తప్పక అప్లై చేసుకోవాల్సిన నోటిఫికేషన్‌లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం నిరుద్యోగులకు అవకాశాలను ఇస్తూ.. వివిధ రకాల నోటిఫికేషన్‌లు వరుసగా విడుదలవుతున్నాయి. ఈ వారం అభ్యర్థులు తప్పక అప్లై చేసుకోవాల్సిన నోటిఫికేషన్‌లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం నిరుద్యోగులకు అవకాశాలను ఇస్తూ.. వివిధ రకాల నోటిఫికేషన్‌లు వరుసగా విడుదలవుతున్నాయి. ఈ వారం అభ్యర్థులు తప్పక అప్లై చేసుకోవాల్సిన నోటిఫికేషన్‌లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం(Job) సంపాదించాలంటే కష్టపడక తప్పదు. అందులోనూ పోటీ ఎక్కువగా ఉండే ప్రభుత్వ ఉద్యోగాలను పొందాలంటే.. తీవ్రంగా శ్రమించాలి. క్రమశిక్షణ, పట్టుదల, కృతనిశ్చయంతో ముందుకు సాగితేనే కల నెరవేరుతుంది. అయితే ప్రస్తుతం నిరుద్యోగులకు అవకాశాలను ఇస్తూ.. వివిధ రకాల నోటిఫికేషన్‌లు వరుసగా విడుదలవుతున్నాయి. ఈ వారం అభ్యర్థులు తప్పక అప్లై చేసుకోవాల్సిన నోటిఫికేషన్‌లు(Notifications) ఏంటో ఇప్పుడు చూద్దాం.

బీఎస్‌ఎఫ్‌ రిక్రూట్‌మెంట్

సైన్యంలో ఉద్యోగం పొందాలని అనుకునే వారికి ఈ జాబ్ నోటిఫికేషన్ సరైన ఎంపిక. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆహ్వానం పలుకుతోంది. అసిస్టెంట్ కమాండెంట్ హోదా ఉండే ఈ పోస్టుల్లో 20 ఖాళీలున్నాయి. ఆసక్తికలిగిన విద్యార్థులు నేటి నుంచి(జనవరి 9 ) దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఆకర్షణీయమైన జీతభత్యాలు ఉంటాయి. 7వ పే కమిషన్ ప్రకారం.. రూ.56,100 నుంచి రూ.1,77,500 మధ్య జీతభత్యాలు ఉంటాయి. వెటరన్నరీ సైన్సెస్, యానిమల్ హస్బెండరీలో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉన్న వారు అర్హులు. అయితే, తప్పనిసరిగా వీరు వెటర్నిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కింద రిజిస్టరై ఉండాలి.

ఎయిర్‌పోర్ట్ అథారిటీ

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 272 ఖాళీలను భర్తీ చేయనున్నారు. జనవరి 21 లోగా దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి రూ.40వేల నుంచి రూ.1.40లక్షల వరకు జీతభత్యాలు ఉంటాయి.

సీఎస్‌ఐఆర్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్స్‌ పోస్టులు

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)లో గ్రేడ్ 3 టెక్నికల్ అసిస్టెంట్స్ పోస్టులు భర్తీ చేయనున్నారు. 34 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన వారు జనవరి 17 లోపు దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ లేదా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లోమా లేదా 3 సంవత్సరాల డిగ్రీ ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. కనీసం 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. ఎంపికైన వారికి రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతభత్యాలు ఉంటాయి.

బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్

బిహార్‌ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పోస్టుల భర్తీకి బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(BPSC) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు, యూజీసీ గుర్తింపు సాధించిన యూనివర్సిటీల నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే.

TSPSC Alert: 10 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్.. రేపటితో ముగియనున్న దరఖాస్తుల గడువు..

శ్రీ అరబిందో కాలేజ్ రిక్రూట్‌మెంట్

ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని శ్రీ అరబిందో కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వృక్షశాస్త్రం, రసాయనశాస్త్రం, కామర్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్‌తో పాటు వివిధ సబ్జెక్టులకు సంబందించిన 111 ఖాళీలను భర్తీ చేయనుంది.డిసెంబరు 31న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మరో రెండు వారాల పాటు అప్లికేషన్లు స్వీకరించనుంది. ఎంపికైన వారికి రూ.57,700 ఉంటుంది.

రాయ్‌పుర్ ఎయిమ్స్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాళీలు

రాయ్‌పుర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా 39 ఖాళీలను భర్తీ చేయనుంది. గ్రూప్ A ఫ్యాకల్టీ కోసం కాంట్రాక్టు పద్ధతిన వీరిని తీసుకోనుంది. జనవరి 27లోగా దరఖాస్తులను పూర్తి చేయాలి. ఎంపికైన వారికి నెలకు రూ 1,42,506 చెల్లిస్తారు. సంబంధిత సబ్జెక్టులో కనీసం 3 సంవత్సరాల బోధనానుభవం లేదా రీసెర్చ్ చేసి ఉండాలి.

First published:

Tags: Central Government Jobs, JOBS, Telangana government jobs

ఉత్తమ కథలు