Home /News /jobs /

NOW HALF A DAY PROGRAMME FOR WOMEN TO RESTART THEIR CAREERS GH VB

Half Day Work: ఇక రోజుకు ఐదు గంటలే పని.. వారికి మాత్రమే ఛాన్స్​.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆ సంస్థలో ఇక రోజుకు ఐదు గంటలు మాత్రమే పని. అయితే ఇక్కడ ఒక కండీషన్ ఉంది. దానికి కేవలం మహిళలు మాత్రమే అర్హులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సాధారణంగా వివాహ అనంతరం(After Marriage), లేదంటే పిల్లలు పుట్టిన తరువాత మహిళలు (Womens) తమ ఉద్యోగాలకు దూరమవుతుంటారు. ఇలా పలు కారణాలతో కెరీర్(Career)​లో వెనుకబడిపోయిన మహిళలు తిరిగి తమ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించేందుకు ఓ సంస్థ వినూత్న కార్యక్రమాన్ని అందిస్తోంది. ఎం2పీ(M2P) ఫిన్‌టెక్(Finteck) అనే ఫైనాన్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ.. బెటర్​ హాఫ్ లేదా హాఫ్- డే ప్రోగ్రామ్(Half Day Programme) పేరుతో ఉద్యోగాలను అర్ధంతరంగా మానేసిన మహిళలు తిరిగి జాబ్​ చేసేలా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా రోజుకు ఐదు గంటలు(Five Hours) పని చేస్తే చాలంటోంది. ఈ ప్రోగ్రామ్‌.. ఉద్యోగం మానేసిన మహిళలు వారి కెరీర్‌లో తిరిగి నిలదొక్కుకునేందుకు తోడ్పాడు అందివ్వనుంది.

ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన వారు తమ నైపుణ్యాలను అప్​గ్రేడ్ చేసుకునేందుకు సహకారం అందిస్తుందీ సంస్థ. అలాగే రెగ్యులర్ ఉద్యోగులకు లభించే అన్నిరకాల ప్రయోజనాలు వీరికీ అందుతాయంటోంది. ఉద్యోగులు కోరుకుంటే క్రమంగా పని గంటలను పెంచడం ద్వారా పూర్తి సమయం ఉపాధి కల్పిస్తారు.

Payments Methods: పేపాల్ నుంచి పేటీఎం వరకు... భారత్‌లో బెస్ట్ పేమెంట్ మెథడ్స్ ఇవే..


అందుకే బెటర్ హాఫ్..
అభ్యర్థులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంలో తోడ్పాటునందిస్తూ.. మెరుగైన కెరీర్ అవకాశాలు కల్పిస్తున్నందున ఈ ప్రోగ్రామ్‌కు బెటర్-హాఫ్ అని పేరు పెట్టింది కంపెనీ. కొత్త అవకాశాలను కోరుకునేవారు, కెరీర్​లో విరామం అనంతరం తిరిగి ఉద్యోగంలో చేరేవారు ఈ ప్రోగ్రామ్​కు అర్హులని ఎం2పీ తన అధికారిక వెబ్‌సైట్‌లో(m2pfintech.com) పేర్కొంది. దీనికి సెలక్ట్ అయినవారు ఆన్-ది-జాబ్ ప్రాజెక్ట్‌లపై పనిచేస్తారు. అలాగే వినూత్న అంశాలు నేర్చుకునే వీలు కలుగుతుంది. అంతేగాక వేర్వేరు బృందాలతో కలసి పని చేసే అవకాశం ఉంటుంది. సీనియర్ల మద్దతు, అనుభవజ్ఞులైన మేనేజర్ల మార్గదర్శకత్వంలో పనిచేస్తారు.

దేశజనాభా సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలంటే.. మహిళల పని సామర్థ్యం పెరగాలని M2P ఫిన్‌టెక్ సహ వ్యవస్థాపకుడు ప్రభు రంగరాజన్ తెలిపారు. ప్రస్తుతం పాటిస్తున్న పద్దతులు కెరీర్​లో బ్రేక్ తీసుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తున్నాయి. గత 2 సంవత్సరాలుగా కొవిడ్ కారణంగా వర్క్​ ఫ్రం హోం అమల్లో ఉంది. అందువల్ల ఇంటి బాధ్యతలను సమన్వయం చేసుకుంటూనే మహిళలు తమను తాము నిరూపించుకునేందుకు అవకాశాన్ని కల్పించేందుకే ఈ ప్రోగ్రామ్​ను ప్రారంభించినట్లు రంగరాజన్ తెలిపారు. వీలైనంత తక్కువ సమయంలోనే తమ సంస్థలో 10 శాతం మంది బెటర్ హాఫ్(హాఫ్​ డే​) ఉద్యోగులను నియమిస్తామని స్పష్టం చేశారు.

బెటర్ హాఫ్ టీమ్ వైవిధ్యతకు మారుపేరుగా ఉంటుందని.. లింగ సమానత్వాన్ని పెంపొందించడమే సంస్థ లక్ష్యమని కంపెనీ తెలిపింది. సౌకర్యవంతమైన పని గంటలతో పాటు, వర్క్​ ఫ్రం ఎనీవేర్​, సంస్థ ప్రయోజనాలన్నీ అందేలా చూడటం, సులువైన సెలవు విధానాలు, పర్సనల్ లైఫ్-ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్సింగ్​ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టం చేసింది.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Womens

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు