తెలంగాణలో(Telangana) ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఒక వైపు పలు పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు లభిస్తున్నాయి.. మరో వైపు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 4 తో పాటు.. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. త్వరలో గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెల్లడి కానున్నాయి.. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ప్రాసెస్ కంటిన్యూ అవుతోంది. డిసెంబర్ 08 నుంచి ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక గ్రూప్ 4 (Group 4) లో 9168 పోస్టులకు డిసెంబర్ 01, 2022న టీఎస్పీఎస్సీ వెబ్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. పూర్తి నోటిఫికేషన్ ను డిసెంబర్ 23న విడుదల చేస్తామని ప్రకటించింది. ఆ రోజు నుంచే దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.
ఇదిలా ఉండగా.. ఆరు నెలలో క్రితమే అటవీ శాఖకు సంబంధించి ఖాళీ పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. కానీ ఇంత వరకు దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాలేదు. అయితే ఫారెస్ట్ కాలేజీలో విద్యను పూర్తి చేసుకున్న వారికి రిజర్వేషన్ విషయంలో తర్జనభర్జన నెలకొంది. దీంతో ఈ నోటిఫికేషన్ అనేది ఇన్ని రోజులు ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చినట్లు సమాచారం. ఈ పోస్టులకు నోటిఫికేషన్ అనేది అత్యంత తొందరగా విడుదల చేయనున్నారు.
అటవీ శాఖలో మొత్తం 1658 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీట్ ఆఫీసర్ , సెక్షన్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అటెండెంట్స్, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ ప్రాఫెసర్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
రాష్ట్ర భౌగోళిక విస్త్రీర్ణం 1,12,077 చ.కిమీ. అందులో అటవీ విస్తీర్ణం 26,903.70 చ. కి.మీ ఉంది. ఈ అడవులను రక్షించేందుకు ఉన్న బీట్ ఆఫీసర్ల సంఖ్య తెలంగాణలో 3647 మంది. దీనిలో 1393 బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం పని చేస్తున్న వారిలో ఎక్కువగా ఉన్నత ఉద్యోగాల శిక్షణకు సెలవులో ఉండగా.. ఆ భారం అంతా పక్కనే ఉన్న మరో బీట్ ఆఫీసర్ పై పడుతోంది. దీంతో ఈ ఖాళీ పోస్టులను అంత్యంత వేగంగా భర్తీ చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య 1,658
విభాగాల వారీగా పోస్టులు ఇలా..
1. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ - 1,393
2. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ - 14
3.ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ - 92
4.టెక్నికల్ అసిస్టెంట్ - 32
5. జూనియర్ అటెండెంట్స్ - 9
6. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ - 18
7.జూనియర్ అసిస్టెంట్ - 75
8.అసిస్టెంట్ ప్రొఫెసర్ (FCRI) - 25
వీటిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఇంటర్ అర్హతగా క్రితం నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ సారి కూడా అదే అర్హత ఉండే అవకాశం ఉంది.
ఇక టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు జోన్ల వారీగా భర్తీ చేస్తారు.. జోన్ల వారీగా పోస్టులు ఇలా..
జోన్ - 1 (కాళేశ్వరం) - 5
జోన్ - 2 (బాసర) - 5
జోన్ - 3 (రాజన్న) - 4
జోన్ - 4 (భద్రాద్రి) - 5
జోన్ - 5 (యాదాద్రి) - 3
జోన్ - 6 (చార్మినార్) - 5
జోన్ - 7 (జోగులాంబ) - 5
మొత్తం - 32 పోస్టులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Telangana government jobs, Telangana jobs, TSPSC, Tspsc jobs