హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana District Court Jobs 2022: గుడ్ న్యూస్.. జిల్లా కోర్టుల నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల..

Telangana District Court Jobs 2022: ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది శుభవార్త లాంటిది. తెలంగాణలోని జిల్లా కోర్టుల్లో పని చేసేందుకు రెండు జిల్లాల నుంచి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణలోని జిల్లా కోర్టుల్లో(Telangana District Court) పని చేసేందుకు రెండు జిల్లాల నుంచి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. నిజామాబాద్, మహబూబాబాద్ జిల్లా కోర్టుల నుంచి దీనికి సంబంధించి ఉద్యోగ నోటఫికేషన్లు విడుదలయ్యాయి. అందులో మొదటగా.. నిజామాబాద్ జిల్లా కోర్టు నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే..

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థి కాంట్రాక్ట్ బేసిస్ మీద పని చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను తగిన అర్హత పత్రాలతో పాటు.. నోటిఫికేషన్ చివరలో ఇచ్చిన అప్లికేషన్ ఫారమ్ ను ప్రింట్ తీసుకోవాలి. దానిలో మీ వివరాలను నింపి.. సర్టిఫికేట్లతో పాటు.. రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్టు ద్వారా PRL. District And Session Judge, Nizamabad అడ్రస్ కు పంపించాలి. 31. 10. 2022 వరకు ఆ దరఖాస్తులను పంపవచ్చు.

దీనిలో మొత్తం పోస్టులు 12 ఉన్నాయి.

సీనియర్ సూపరింటెండెటంట్ - 01, (ఈ పోస్టులకు రిటైర్డ్ Judicial Employees మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

సీనియర్ అసిస్టెంట్ - 01 ,

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 - 01 ,

జూనియర్ అసిస్టెంట్ - 02 ,

టైపిస్ట్- 02,

డ్రైవర్- 01,

ఆఫీస్ సబ్ ఆర్డినేట్ (అటెండర్ )- 04 పోస్టులు ఉన్నాయి.

జీతం రూ.40 వేల నుంచి రూ.15,600 వరకు పోస్టుల బట్టి చెల్లిస్తారు.

వయోపరిమితి..

18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు 5 ఏళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

అర్హతలు..

ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. టైపిస్ట్ పోస్టులకు ఏదైనా డిగ్రీతో పాటు.. ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

స్టేనోగ్రాఫర్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టైప్ రైటింగ్ సర్టిఫికేట్ తో పాటు.. హయ్యర్ లో షార్ట్ హ్యాంట్ సర్టిఫికేట్ పొంది ఉండాలి.

డ్రైవర్ , అటెండర్ పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి.

Jobs In NIC: డిగ్రీ ఉంటే చాలు.. నెలకు రూ.2,16,600 జీతం పొందొచ్చు..

మహబూబాబాద్ జిల్లా కోర్టు నోటిఫికేషన్ వివరాలిలా..

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థి కాంట్రాక్ట్ బేసిస్ మీద పని చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను తగిన అర్హత పత్రాలతో పాటు.. నోటిఫికేషన్ చివరలో ఇచ్చిన అప్లికేషన్ ఫారమ్ ను ప్రింట్ తీసుకోవాలి. దానిలో మీ వివరాలను నింపి.. సర్టిఫికేట్లతో పాటు.. రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్టు ద్వారా PRL. District And Session Judge, Mahabubabad అడ్రస్ కు పంపించాలి. 31.10.2022 వరకు ఆ దరఖాస్తులను పంపవచ్చు.

దీనిలో మొత్తం పోస్టులు 10 ఉన్నాయి.

సీనియర్ అసిస్టెంట్ - 01 ,

జూనియర్ అసిస్టెంట్ - 02 ,

టైపిస్ట్- 02,

డ్రైవర్- 01,

ఆఫీస్ సబ్ ఆర్డినేట్ (అటెండర్ )- 04 పోస్టులు ఉన్నాయి.

జీతం రూ.22,750 నుంచి రూ.15,600 వరకు పోస్టుల బట్టి చెల్లిస్తారు.

వయోపరిమితి..

18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు 5 ఏళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

అర్హతలు..

ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. టైపిస్ట్ పోస్టులకు ఏదైనా డిగ్రీతో పాటు.. ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

డ్రైవర్ , అటెండర్ పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి.

నిజామాబాద్ నోటిఫికేషన్ PDF కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

మహబూబాబాద్ నోటిఫికేషన్ PDF కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

First published:

Tags: Career and Courses, Court jobs, JOBS, Jobs in telangana, Telangana jobs

ఉత్తమ కథలు