నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్..

ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ పరిధిలో దాదాపు 9 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు.ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అధికారులు ఖాళీలను గుర్తించారు.

news18-telugu
Updated: June 11, 2020, 10:37 AM IST
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఖాళీలను భర్తీ చేసేందుకు భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ పరిధిలో దాదాపు 9 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యా, వైద్యం, ఆరోగ్య రంగాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనికితోడు కరోనా మహమ్మారి కారణంగా వైద్యారోగ్య శాఖలో పలు సంస్కరణలు తీసుకునేందుకు నిర్ణయించారు. అందులో భాగంగానే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు.ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అధికారులు ఖాళీలను గుర్తించారు. అందుకు అనుగుణంగా డీఎంఈ, వైద్య విధాన పరిషత్, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో 5,701 ఖాళీలు, 804 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి అనుమతి లభించింది.

వీటితో పాటుగా 2,186 స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పాటు ఆయా కేటగిరీల్లో ఖాళీగా ఉన్న మరో 1021 పోస్టులను భర్తీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా వైద్యారోగ్య శాఖలో దాదాపు 9వేల పైచిలుకు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తుండడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయనే చెప్పాలి.
First published: June 11, 2020, 10:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading