Venu, News18, Mulugu
తెలంగాణ (Telangana) లో ఉద్యోగాల జాతర (TS Jobs-2022) కొనసాగుతోంది. రెగ్యులర్ జాబ్స్ తో పాటు కాంట్రాక్ పద్ధితి (Telangana Contract Jobs) లోనూ ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. దీనిపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. తాజాగా ములుగు జిల్లా (Mulugu District) కోర్టులో 13 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. డిగ్రీ అర్హతతో రూ.40వేల వరకు జీతంతో ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తోంది. 13 రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం.. అర్హతలు, జీతాలు, ఇతర వివరాలను కూడా ప్రకటించింది. హెడ్ క్లర్క్ నుంచి డ్రైవర్ జాబ్స్ వరకు వివరాలను అధికారులు విడుదల చేశారు.
హెడ్ క్లర్క్ - 01, అర్హత :హెడ్ క్లర్క్ ఉద్యోగానికి చేసుకునే అభ్యర్థుల అర్హతలు.. డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. న్యాయవ్యవస్థలో సీనియర్ సూపరింటెండెంట్ గా పనిచేసి పదవి విరమణ పొంది ఉండాలి. జీతం : 40,000.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3-01అర్హత : స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. .తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు పొందిన టెక్నికల్ ఎగ్జామినేషన్ షార్ట్ హ్యాండ్ సర్టిఫికెట్కలిగి ఉండాలి. జీతం : 19500.
సీనియర్ అసిస్టెంట్-01: అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. జీతం : 22,750
జూనియర్ అసిస్టెంట్-02: అర్హత-ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలికంప్యూటర్ పరిజ్ఞానం తెలిసి ఉండాలి. జీతం: 19500
టైపిస్ట్-02: అర్హత-ఏదైనా డిగ్రీ పట్టా కలిగి ఉండాలి. ప్రభుత్వం గుర్తింపు పొందిన టెక్నికల్ ఎగ్జామినేషన్, ఇంగ్లీష్ టైప్ రైటింగ్, హైయర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ పొంది ఉండాలి.. జీతం: 19500
డ్రైవర్- 01 అర్హత : తెలుగు చదవడం రాయడం వచ్చి ఉండాలి మరియు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. జీతం: 19500
ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) -04 అర్హత : ఏడవ తరగతి పాసై ఉండాలి. జీతం: 15600
ఎలా దరఖాస్తు చేసుకోవాలి
అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత పత్రాలను, దరఖాస్తు కాపీని "డిస్టిక్ అండ్ సెషన్స్ జడ్జ్, ములుగు " పేరుతో పోస్టల్ ఆర్డర్ ద్వారా లేదా కొరియర్ ద్వారా పంపవచ్చు
ఏ విధంగా సెలక్షన్ చేస్తారు...?
స్టెనోగ్రాఫర్ టైపిస్ట్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. డ్రైవర్ ఉద్యోగాలకు అభ్యర్థులకు టెస్ట్ డ్రైవింగ్ అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు 20 కంటే అప్లికేషన్స్ ఎక్కువ వస్తే అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ప్రకారం ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు జతచేయవలసిన పత్రాలు
ఆసక్తికర అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందుఅర్హతకు సంబంధించిన అకాడమిక్ సర్టిఫికెట్స్, మెమోస్,డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్, ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్ లోకల్ సర్టిఫికెట్లు జత చేసి 05/12/2022 లోపు దరఖాస్తులను సమర్పించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Mulugu jobs, Telangana