హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Govt Jobs: ఏపీలో అంగన్వాడీ పోస్టులు భర్తీ.. ఖాళీలు, దరఖాస్తు వివరాలివే..!

AP Govt Jobs: ఏపీలో అంగన్వాడీ పోస్టులు భర్తీ.. ఖాళీలు, దరఖాస్తు వివరాలివే..!

పశ్చిమ గోదావరి జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీ

పశ్చిమ గోదావరి జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీ

ప‌శ్చిమ గోదావ‌రి (West Godavari District) లో పోస్టుల‌కు నోటిఫికేష‌న్ జారీ అయ్యింది. ఐ.సి.డి.యస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడి సహాయకురాళ్లు, మినీ అంగన్వాడి కార్యకర్తలు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ ,సాధికారిత అధికారి కె.ఎ.వి.ఎల్ పద్మావతి నోటిఫికేష‌న్ వివ‌రాలను వెల్ల‌డించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • West Godavari, India

P Ramesh, News18, Kakinada

ఉభ‌య‌ గోదావ‌రి జిల్లాలో అత్యంత డిమాండ్ ఉన్న పోస్టు ఏదైనా ఉందంటే అది అంగ‌న్‌వాడీ కార్యకర్త (AP Anganwadi Posts). స్థానికంగా ఉండి నెల‌కు మంచి జీతం, నీడ పాటున ఉద్యోగం అందుకే ఎక్కువ‌గా ఈ పోస్టులు ద‌క్కించుకునేందుకు ఆస‌క్తి చూపుతారు మ‌హిళ‌లు. తాజాగా ప‌శ్చిమ గోదావ‌రి (West Godavari District) లో పోస్టుల‌కు నోటిఫికేష‌న్ జారీ అయ్యింది. ఐ.సి.డి.యస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడి సహాయకురాళ్లు, మినీ అంగన్వాడి కార్యకర్తలు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ ,సాధికారిత అధికారి కె.ఎ.వి.ఎల్ పద్మావతి నోటిఫికేష‌న్ వివ‌రాలను వెల్ల‌డించారు.

పోస్టులు ఎక్క‌డెక్క‌డంటే..!

ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి సహాయకురాలు పోస్టులు (2). బుట్టాయగూడెం ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి కార్యకర్త పోస్టులు( 3) అంగన్వాడి సహాయకురాలు పోస్టు (8).చింతలపూడి ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి కార్యకర్త పోస్టు (1), అంగన్వాడి సహాయకురాలు పోస్టులు (3). ఏలూరు ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి కార్యకర్త పోస్టులు (4), అంగన్వాడి సహాయకురాలు పోస్టు (1). గణపవరం ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి కార్యకర్త పోస్టులు (2), అంగన్వాడి సహాయకురాలు పోస్టులు (4). కైకలూరు ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి సహాయకురాలు పోస్టులు (3). కొయ్యలగూడెం ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి కార్యకర్త పోస్టు ( 1), అంగన్వాడి సహాయకురాలు పోస్టులు (6).

ఇది చదవండి: విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్తగా ఐదు నైపుణ్యశిక్షణ కేంద్రాలు.. వివరాలివే..!

మండవల్లి ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి కార్యకర్త పోస్టు (1), అంగన్వాడి సహాయకురాలు పోస్టులు (3). నల్లజర్ల ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి కార్యకర్త పోస్టు (1), అంగన్వాడి సహాయకురాలు పోస్టలు (2). నూజివీడు ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి కార్యకర్త పోస్టు (1), అంగన్వాడి సహాయకురాలు పోస్టులు (4), మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టు(1). పెదపాడు ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి కార్యకర్త పోస్టులు ( 2), అంగన్వాడి సహాయకురాలు పోస్టులు (4), మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టు (1). పోలవరం ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి సహాయకురాలు పోస్టు (1), మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టు (1). విసన్నపేట ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో పోస్టులు నిల్. ఈ ఖాళీలను భర్తీ చేయుటకు సంబంధిత సి.డి.పి.ఓ.ల ద్వారా సంబంధిత ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ లలో నోటిఫికేషన్ జారీ చేయబడుతుందని తెలిపారు.

అర్హ‌త‌లివే..!

అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌, స‌హాయ‌కురాలుగా ద‌ర‌ఖాస్తు చేయాలంటే మొద‌ట స్థానికురాలై ఉండాలి, ప‌ది ఆపైన చ‌దివి ఉన్న‌వారు అర్హులు. ద‌ర‌ఖాస్తు ఆయా ప‌రిధిలోని ఐసిడిఎస్ సీడీపీవో కార్యాల‌యంలో అంద‌జేయాలి. ద‌ర‌ఖాస్తు ప‌రిశీల‌న అనంత‌రం ఇంట‌ర్వ్యూ ఉంటుంది. ప్ర‌త్యేక క‌మిటీ ద్వారా నియామకం జ‌రుగుతుంది. ద‌ర‌ఖాస్తు దారులు నోటిఫికేష‌న్‌లో రోస్ట‌ర్‌ను చూసుకోవాలి. రిజ‌ర్వేష‌న్ ప్రాతిప‌దిక‌న కేటాయించిన పోస్టులు సంబంధిత వ‌ర్గానికి మాత్ర‌మే ఇస్తారు. జ‌న‌ర‌ల్ కేటగిరీలో అంద‌రూ పోటీ ప‌డొచ్చు. ఎక్స్ ఆర్మీ , దివ్యాంగుల కోటా ఆయా వ‌ర్గానికే ఇస్తారు. కార్య‌క‌ర్త‌, స‌హ‌య‌కురాలు ఏదో ఒక పోస్టుకు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది.

First published:

Tags: Andhra Pradesh, Anganwadi, Local News, West Godavari

ఉత్తమ కథలు