హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Jobs: ఆ జిల్లాలో మహిళలకు గుడ్ న్యూస్.. మీ కోసమే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు.. వివరాలివే..!

AP Jobs: ఆ జిల్లాలో మహిళలకు గుడ్ న్యూస్.. మీ కోసమే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు.. వివరాలివే..!

అల్లూరి జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

అల్లూరి జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitharama Raju District) లో ఖాళీగా ఉన్న 48 అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల (AP Anganwadi Jobs) భర్తీకి అర్హుల నుండి దరఖా స్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Setti Jagadeesh, News 18, Visakhapatnam

అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitharama Raju District) లో ఖాళీగా ఉన్న 48 అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల (AP Anganwadi Jobs) భర్తీకి అర్హుల నుండి దరఖా స్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. పాడేరు డివిజన్ పరిదిలో ఖాళీగా ఉన్న 26 అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ అంగన్వాడీ కార్య కర్తల పోస్టుల భర్తీకి, రంపచోడవరం డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న 9 అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల భర్తీకి, చింతూరు డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న 13 అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ అంగన్వాడీ పరిశీలించి ఎంపిక కార్యకర్తల పోస్టుల భర్తీకి, చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

అర్హత కలిగిన మహిళ అభ్యర్థులు 2023 మార్చి 17 నుండి 24వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోగా సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారికి నేరుగా గాని పోస్ట్ ద్వారా గాని దరఖాస్తులు సమర్పించాలని, అంగన్వాడీ కార్యకర్త, ఆయా, మినీ కార్యకర్తల పోస్టులకు దరఖాస్తు చేయదలచిన మహిళలు తప్పనిసరిగా పదోతరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని, ప్రధానంగా స్థానికంగా నివాసం కలిగి ఉండాలని, వివాహిత అయి ఉండాలని, 2023 జూలై 1 నాటికి అభ్యర్థులు 21 సంవత్సరాలు పూర్తి చేసి 35 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలని, 21 సంవత్సరాలలోపు అభ్యర్థులు లభించని పక్షంలో 18 సంవత్స రాలు పూర్తయిన వారి దరఖాస్తులు పరిశీలించబడతాయని అయితే కేవలం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన కేంద్రాలకే వర్తిస్తుందన్నారు.

ఇది చదవండి: ఈ బిజినెస్‌తో లాభాలు పక్కా..! గవర్నమెంట్ జాబ్ కంటే ఎక్కువ ఆదాయం..!

ఎంపికలో పదవ తరగతి ఉత్తీర్ణత 50 మార్కులు, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్ధులకు ఐదు మార్కులు, వితంతువులకు ఐదుమార్కులు, మైనర్ పిల్లలు కలిగి ఉన్న వితంతువులకు ఐదు మార్కులు, పూర్తి అనాధ, క్రెచ్, హోమ్, ప్రభుత్వ సంస్థలలో నివశించు సత్ప్రవర్తన సర్టిఫికెట్ కలిగిన వారికి 10 మార్కులు, అర్హత కలిగిన వికలాంగ వ్యక్తులకు ఐదు మార్కులు మౌఖికం పరీక్షకు 20 మార్కులు మొత్తం 100 మార్కులకు లెక్కించబడుతుందని తెలిపారు.

మార్కుల ఆధారంగా పూర్తి పారదర్శక తతో నియామకాలు జరుగుతాయని ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేదన్నారు. అభ్యర్థులు మధ్యవర్తులను, దళారులను నమ్మి మోసపోవద్దని, వారి అర్హతలను, బట్టి తీసుకోవడంజరుగుతుందన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Anganwadi, Ap jobs, Local News, Visakhapatnam

ఉత్తమ కథలు