Home /News /jobs /

NOTIFICATION RELEASED FOR ADMISSIONS INTO MODEL SCHOOLS IN ANDHRA PRADESH HERE FULL DETAILS NS

Andhra Pradesh Admissions: ఏపీలోని విద్యార్థులకు అలర్ట్.. ఆ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh Model School Admissions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలుగు రాష్ట్రాల్లోని మోడల్ స్కూళ్ల(ఆదర్శ పాఠశాలల) నిర్వహణ విజయవంతంగా సాగుతోంది. దీంతో ఆయా పాఠశాలల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంటోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటికే ఆయా స్కూళ్లలో అడ్మిషన్లకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. తాజాగా ఏపీలోని మోడల్ స్కూళ్లలో ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు ఏపీ మోడల్ స్కూళ్ల సొసైటీ కార్యదర్శి దుక్కిపాటి ముధుసూదనరావు వివరాలను వెల్లడించారు. రానున్న విద్యాసంవత్సరం 2021-22కు గానూ మోడల్ స్కూళ్లలో ఆరో తరగతిలో ప్రవేశాలకు అర్హత కలిగిన విద్యార్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలని సూచించారు. లాటరీ విధానంలో విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుందని వివరించారు. ఈ స్కూళ్లలో అడ్మిషన్ పొందిన విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయబడదని ఆయన స్పష్టం చేశారు.

    అడ్మిషన్ కోసం అర్హతలు..
    -మోడల్ స్కూళ్లలో ప్రవేశం పొందాలనుకుంటున్న విద్యార్థులు ఈ క్రింది అర్హతలు పొంది ఉండాలి.
    -ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2007 సెప్టెంబర్ 01 నుంచి 2011 ఆగస్టు 31 మధ్యలో జన్మించి ఉండాలి.
    -ఓసీ, బీసీ విద్యార్థులు 2009 సెప్టెంబర్ 1 నుంచి 2011 ఆగస్టు 31 మధ్యలో జన్మించి ఉండాలి.
    -విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లలో 2019-20, 2020-21 విద్యా సంవత్సరాల్లో నిరవధికంగా చదివి ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు.
    -ఆయా విద్యార్థులు ప్రస్తుతం ఐదో తరగతి చదువుతూ ఉండాలి. తర్వత తరగతికి ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.

    -అభ్యర్థులు www.cse.ap.gov.in లేదా apms.ap.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. -దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 16న ప్రారంభం కానుండగా మే 15న ముగుస్తుంది.
    -అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    -అప్లికేషన్ ఫీజును రూ.100గా నిర్ణయించారు. ఎస్టీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. వారికి ఫీజుగా రూ. 50ని నిర్ణయించారు. ఇతర వివరాలకు విద్యార్థులు సమీపంలోని మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్ ను లేదా జిల్లా, మండల విద్యాధికారులను సంప్రదించవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, AP Schools, School admissions

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు