తెలంగాణలోని(Telangana) మహబూబాబాద్ జిల్లాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పలు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను https://mahabubabad.telangana.gov.in/ సందర్శించి దరఖాస్తు(Application) చేసుకోవచ్చు. మొత్తం 24 పొస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలిలా..
పోస్టు పేరు | సంఖ్య |
స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ / స్టెనో టైపిస్ట్ / స్టెనోగ్రాఫర్ / డేటా ఎంట్రీ ఆపరేటర్ | 10 |
డిసెక్షన్ హాల్ అటెండెంట్లు | 04 |
ల్యాబ్-అటెండెంట్లు | 04 |
రికార్డు అసిస్టెంట్ | 02 |
థియేటర్ అసిస్టెంట్ | 04 |
అర్హతలు..
- స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ / స్టెనో టైపిస్ట్ / స్టెనోగ్రాఫర్ / డేటా ఎంట్రీ ఆపరేటర్ : బీఎస్సీ కంప్యూటర్ లేదా బీకామ్ కంప్యూటర్ లేదా ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
-డిసెక్షన్ హాల్ అటెండెంట్లు : పదో తరగతి తప్పని సరిగా పాస్ అయి ఉండాలి. దీంతో పాటు.. సంబంధిత పనిలో ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి.
-ల్యాబ్-అటెండెంట్లు : ఎంఎల్టీ/డీఎంఎల్టీ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. తెలంగాణ పారా మెడికల్ లో రిజిస్ట్ర్ అయి ఉండాలి.
-రికార్డు అసిస్టెంట్ : మెడికల్ రికార్డు లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు.. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
-థియేటర్ అసిస్టెంట్ : పదో తరగతి తప్పనిసరిగా అర్హత సాధించి ఉండాలి.
జీతం వివరాలు..
-ఎంపికైన అభ్యర్థులకు పోస్టును అనుసరించి రూ.19,500 నుంచి రూ.15,600 వరకు చెల్లిస్తారు.
వయోపరిమితి..
దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు జూల్ 01, 2022 వరకు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది. దివ్యాంగుల అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
ఆన్ లైన్ లో దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 19 నుంచి ప్రారంభం అయింది. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 25, 2022
దరఖాస్తు విధానం ఇలా..
-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
-తర్వాత ఇక్కడ మరో పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో ఆన్ లైన్ అప్లికేషన్ ఫారమ్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
-దీనిలో అప్లికేషన్ ఫారమ్ ల పేర్కొన్న వివరాలను నింపాలి.
-అవసరమైన డాక్యుమెంట్లను కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
-చివరకు సబ్ మిట్ బటన్ పై క్లిక్ చేస్తే.. మీ దరఖాస్తు పూర్తి అయినట్లే.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పీడీఎఫ్ కొరకు ఇక్కడ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://mahabubabad.telangana.gov.in/ సందర్శించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Mahabubabad, Private Jobs, Telangana government jobs