హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana District Posts: తెలంగాణలోని ఈ జిల్లాల్లో MLHP పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండిలా..

Telangana District Posts: తెలంగాణలోని ఈ జిల్లాల్లో MLHP పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండిలా..

Telangana District Posts: తెలంగాణలోని ఈ జిల్లాల్లో MLHP పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండిలా..

Telangana District Posts: తెలంగాణలోని ఈ జిల్లాల్లో MLHP పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండిలా..

ఇటీవల తెలంగాణలో బస్తీ, పల్లె దవాఖానాలను ప్రభుత్వం(Government) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా హెల్త్‌ సబ్‌ సెంటర్లను(Health Sub Centers) పల్లె దవాఖానలుగా ప్రభుత్వం మార్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఇటీవల తెలంగాణలో బస్తీ, పల్లె దవాఖానాలను ప్రభుత్వం(Government) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా హెల్త్‌ సబ్‌ సెంటర్లను(Health Sub Centers) పల్లె దవాఖానలుగా ప్రభుత్వం మార్చింది. పైసా ఖర్చు లేకుండా సొంతూర్లలోనే వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. వీటిలో అవసరమైన సిబ్బంది, వైద్యులు లేకపోవడంతో రోగులకు ఎంతో ఇబ్బంది గా మారింది. ఇక నుంచి ఆ సమస్య ఉండకూడదని.. మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (Mid Level Health Providers) పోస్టుల నియామకాలకు వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే జిల్లాల వ్యాప్తంగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నారు.

Career Tips: మీరు కాలేజీ స్టూడెంట్స్ అయితే.. ఈ అలవాట్లను మానుకోండి.. లేదంటే..

Mid level health provider Posts భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నల్గొండ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎంబీబీఎస్‌/బీఏఎంఎస్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంబీబీఎస్‌ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. వీరు అందుబాటులో లేకపోతే.. బీఎస్సీ నర్సింగ్ పట్టభద్రులకు అవకాశం ఇవ్వనున్నారు. అయితే వీరు 2020 తర్వాత ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్‌/జీఎన్‌ఎంలో ఉత్తీర్ణులై, కమ్యూనిటీ హెల్త్‌లో 6 నెలల బ్రిడ్జ్‌ ప్రొగ్రామ్‌ను పూర్తిచేసిన వారిని పరిగణనలోకి తీసుకోనున్నారు.

అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఆఫ్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 17, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా దరఖాస్తు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తులను జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయం, నల్గొండ, తెలంగాణ అడ్రస్ కు పంపించాలి. నల్గొండ జిల్లాలో మొత్తం 96 మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టులకు సంబంధించి ఈ రిక్రూట్ మెంట్ జరగనుంది. తుది ఎంపిక ఫలితాలు అక్టోబర్‌ 3, 2022వ తేదీన ప్రకటిస్తారు. ఎంపికైన వైద్యులకు నెలకు రూ. 40 వేలు, స్టాఫ్ నర్సు పోస్టులకు నెలకు రూ.29,900 గౌరవ వేతనం అందిస్తారు.

Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్నారా.. వారి కోసం మంచి అవకాశం.. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..

అదే విధంగా నిజామాబాద్ జిల్లాలో కూడా 97 మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టులభర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి నిజామాబాద్‌ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా.. జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, నిజామాబాద్, తెలంగాణ. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 17. తుది ఫలితాలు అక్టోబర్ 3, 2022న వెల్లడిస్తారు. అంతే కాకుండా..జోగులాంబ గద్వాలలో కూడా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం ఈ జిల్లా నుంచి 26 పోస్టులను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు ఫారమ్ మరియు ఇతర వివరాల కొరకు నల్గొండ జిల్లా వాసులు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Heath tips, JOBS, Mlhp

ఉత్తమ కథలు