ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభియాన్ నుంచి పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 37 పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. వీటిలో కొన్ని పోస్టులక డిగ్రీ అర్హతగా పేర్కొనగా.. మరికొన్ని పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతగా పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఆయా జిల్లాల SSA ఆఫీసులలో పని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ జనవరి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 31గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య 37. విభాగాల వారీగా ఇలా ఉన్నాయి.
1. జూనియర్ అసిస్టెంట్ 13,
2. డేటా ఎంట్రీ ఆపరేటర్ 10,
3. ఆఫీస్ సబ్ ఆర్డినేట్ 14 పోస్టులున్నాయి.
వయోపరిమితి..
అభ్యర్థుల వయస్సు 30/11/2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. దీనిలో రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, బీసీ, ఎస్టీ అభ్యర్థులు 5 ఏళ్ల వరకు సడలింపు ఇచ్చారు.
విద్యార్హతలు :
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ..
ఏదైనా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. MS ఆఫీస్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. DCA లేదా PGDCA కోర్స్ యొక్క సెర్టిఫికెట్ కలిగి ఉండాలి.లేదంటే.. ఏదైనా కంప్యూటర్ కోర్సు కలిగిన గ్రాడ్యుయేషన్ పూర్తై ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు..
ఏదైనా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి. వీటితో పాటు.. టైపింగ్ స్కిల్స్, MS ఆఫీస్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. DCA లేదా PGDCA కోర్స్ యొక్క సెర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేదా ఏదైనా కంప్యూటర్ కోర్సు కలిగిన గ్రాడ్యుయేషన్ పూర్తై ఉండాలి.
ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్టులు..
10వ తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది. తెలుగు, ఇంగ్లీష్ చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
దరఖాస్తు ఫీజు..
జనరల్ అభ్యర్థులకు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కూడా రూ. 500 చెల్లించాలి. చెల్లింపు విధానం డెబిట్/ క్రెడిట్ కార్డ్/ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఉండాలి.
ఎంపిక విధానం..
రాత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://cse.ap.gov.in/ సందర్శించి తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, Career and Courses, JOBS