హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SBI SO Recruitment 2022: ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. రేపే దరఖాస్తులకు చివరి తేదీ..

SBI SO Recruitment 2022: ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. రేపే దరఖాస్తులకు చివరి తేదీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారీగా ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇటీవల నోటిఫికేషన్ (SBI Job Notification) విడుదల చేసింది SBI.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారీగా ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇటీవల నోటిఫికేషన్ (SBI Job Notification) విడుదల చేసింది SBI. మొత్తం 665 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి రేపే(సెప్టెంబర్ 20) చివరి తేదీగా నిర్ణయించారు.  అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రేపు సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు చేసుకోవాలి.

మొత్తం ఖాళీలు..665 పోస్టులను భర్తీ చేస్తారు.

BOB Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు .. మరి కొన్ని గంటల్లో ముగియనున్న దరఖాస్తుల ప్రక్రియ..

ఖాళీల వివరాలు:

1. మేనేజర్ (బిజినెస్ ప్రాసెస్) 1

2. సెంట్రల్ ఆపరేషన్స్ టీమ్ - సపోర్ట్ 2

3. మేనేజర్ (బిజినెస్ డెవలప్మెంట్) 2

4. ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ బిజినెస్ 2

5. రిలేషన్ షిప్ మేనేజర్ 335

6. ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ 52

7. సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్ 147

8. రిలేషన్ షిప్ మేనేజర్ (టీమ్ లీడ్) 37

9. రీజినల్ హెడ్ 127

10. కస్టమర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ 75

మొత్తం: 665 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హతల వివరాలు: 

సంబంధిత స్పెషలైజేషన్లలో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌, ఎంబీఏ/పీజీడీఎమ్‌/పీజీ డిగ్రీ/ఐటీ లేదా అందుకు సమానమైన విద్యార్హతలను కలిగి ఉండాలి. 60 శాతం మార్కులను పొంది ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. అభ్యర్థులు ఇతర అనుభవం, తదితర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అభ్యర్థుల వయస్సు 32 - 50 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు దరఖాస్తు సమయంలో రూ.750 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. SC/ST/PWD/Women అభ్యర్ధులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

BRAOU Update: అంబేద్కర్ వర్సిటీలో ప్రవేశాలపై అప్ డేట్.. పూర్తి వివరాలిలా..

దరఖాస్తు ప్రక్రియ ఇలా.. 

Step 1: అభ్యర్థులు మొదటగా ఈ లింక్ (https://recruitment.bank.sbi/crpd-sco-2022-23-16/apply) ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో సూచించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

Step 4: వివరాల నమోదు తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి.

Published by:Veera Babu
First published:

Tags: Bank Jobs, Bank Jobs 2021, Career and Courses, JOBS, Sbi, Sbi jobs

ఉత్తమ కథలు