హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 1147 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

Telangana Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 1147 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1147 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1147 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  మెడిక‌ల్ విద్య పూరి చేసుకున్న వారికి తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైద్యారోగ్య శాఖ‌లో 1147 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువడింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 20, 2022 ఉదయం 10.30 గంటల నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

జనవరి 05, 2023 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. మొత్తం 34 విభాగాల్లో 1147 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. పూర్తి వివరాలకు https://mhsrd.telangana.gov.in వెబ్ సైట్ సందర్శించొచ్చు. మొత్తం 1147 పోస్టుల్లో అధికంగా అన‌స్థీషియాలో 155, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీలో 117, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌లో 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పోస్టుల వివరాలు, జీతం వివరాలిలా.. 

1 . అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, అనాట‌మీ – 26

2 . అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, ఫిజియాల‌జీ – 26

3 . అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, పాథాల‌జీ – 31

4. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, క‌మ్యూనిటీ మెడిసిన్(ఎస్‌పీఎం) – 23

5. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, మైక్రో బ‌యాల‌జీ – 25

6. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, ఫొరెన్సిక్ మెడిసిన్, టాక్సికాల‌జీ – 25

7. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, బ‌యోకెమిస్ట్రీ – 20

8. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, ట్రాన్స్‌ఫ్యూజ‌న్ మెడిసిన్ – 14

9. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, జ‌న‌ర‌ల్ మెడిసిన్ – 111

10. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ – 117

11. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, పీడియాట్రిక్స్ – 77

12. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, అన‌స్థీషియా – 155

13. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, రేడియో డ‌యాగ్నోసిస్ – 46

14. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, రేడియేష‌న్ అంకాల‌జీ -05

15. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, సైకియాట్రి – 23

16. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, రెస్పిరేట‌రి మెడిసిన్ – 10

17. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, డెర్మ‌టాల‌జీ – 13

18. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, ఒబెస్టిట్రిక్స్, గైన‌కాల‌జీ – 142

19. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, అప్తామాల‌జీ – 08

20. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, ఆర్థోపెడిక్స్ – 62

21. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, ఈఎన్టీ – 15

22. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, హాస్పిట‌ల్ అడ్మిన్ – 14

23. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, ఎమ‌ర్జెన్సీ మెడిసిన్ – 15

24. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, కార్డియాల‌జీ – 17

25. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, కార్డియాక్ స‌ర్జ‌రీ – 21

26. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, ఎండోక్రైనాల‌జీ – 12

27. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, గ్యాస్ట్రో ఎంట్రాల‌జీ – 14

28. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, న్యూరాల‌జీ – 11

29. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, న్యూరో స‌ర్జ‌రీ – 16

30. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, ప్లాస్టిక్ స‌ర్జ‌రీ – 17

31. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, పీడియాట్రిక్ స‌ర్జ‌రీ -08

32. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, యూరాల‌జీ – 17

33. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, నెఫ్రాల‌జీ – 10

34. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, మెడిక‌ల్ అంకాల‌జీ -01

దీనికి సంబంధించి ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టులకు సంబంధించి వివరాలను పోస్టు చేశారు.

జీతం.. అన్ని పోస్టులకు నెలకు రూ. 68,900 - రూ. 2,05,500 మధ్య వేతనం చెల్లిస్తారు. మల్టీజోన్ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు.

అర్హతలు.. సంబంధిత పోస్టులకు సంబంధించి మెడికల్ విభాగంలో ఎంఎస్సీ, ఎంఎస్, ఎండీ చేసి ఉండాలి. వీటితో పాటు.. పలు పోస్టులకు పని అనుభవం కూడా ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

First published:

Tags: JOBS, Telangana government jobs

ఉత్తమ కథలు