సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 322 హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల దరఖాస్తుదారులు అధికారిక వెబ్సైట్ crpf.gov.in ద్వారా నిర్ణీత ఫార్మాట్లో 21/11/2022న లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు. స్పోర్ట్స్ పనితీరు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌లు, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్‌లు, మెరిట్ లిస్ట్‌లు, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్స్ మరియు రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ల ఆధారంగా పోస్టుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హతను పూర్తి చేసిన అభ్యర్థులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు రుసుము, ముఖ్యమైన తేదీలు, ఎలా దరఖాస్తు చేయాలి, వయోపరిమితి, విద్యార్హత మరియు అర్హతల వివరాలు ఇక్కడ తులుసుకోండి.
మొత్తం ఖాళీ పోస్టులు 322
పురుషులకు- 257, మహిళలకు-65 పోస్టులను కేటాయించారు.
విభాగం | పురుషులు | మహిళలు |
అర్చరీ | 02 | 04 |
అథ్లెటిక్స్ | 42 | 08 |
బ్యాడ్మింటన్ | 06 | 02 |
బాస్కెట్‌బాల్ | 06 | - |
బాడీబిల్డింగ్ | 14 | - |
బాక్సింగ్ | 14 | 03 |
ఫుట్‌బాల్ | 04 | 03 |
జిమ్నాస్టిక్స్ | 09 | – |
హ్యాండ్‌బాల్ | 04 | – |
హాకీ | 09 | 04 |
జూడో | 13 | 04 |
కబడ్డీ | 09 | 03 |
కరాటే | 07 | 03 |
షూటింగ్ | 18 | - |
ఈత | 16 | 04 |
వాటర్ పోలో | 04 | – |
ట్రయాథ్లాన్ | 02 | – |
టైక్వాండో | 11 | 04 |
వాలీబాల్ | 06 | 03 |
వాటర్ గేమ్స్ | 14 | 06 |
వెయిట్ లిఫ్టింగ్ | 07 | 04 |
రెజ్లింగ్ (ఫ్రీ స్టైల్) | 09 | 07 |
రెజ్లింగ్ (గ్రీకో రోమన్) | 07 | – |
వుషు | 24 | 03 |
దరఖాస్తుకు చివరి తేదీ: రిక్రూట్మెంట్ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.
వయో పరిమితి.. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం ఎంపికై అభ్యర్థులకు నెలకు వేతనం రూ.25,500 నుంచి రూ.81,100 ఉంటుంది.
అర్హతలు:హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) అభ్యర్థులు 12వ తరగతి లేదా తత్సమానం పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు.. సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: క్రీడా ప్రదర్శన, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెరిట్ లిస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
పోస్టుల కోసం దరఖాస్తు ఇలా..
-ముందుగా అభ్యర్థులు CRPF వెబ్సైట్ www.crpf.gov.inని సందర్శించండి.
-దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేయండి.
-దరఖాస్తు ఫారమ్ లో సంబంధిత సరైన వివరాలతో ఫారమ్‌ను పూరించండి.
-అవసరమైన పత్రాల యొక్క అన్ని జిరాక్స్ కాపీలను అటాచ్ చేయండి.
-తర్వాత దరఖాస్తు ఫీచు చెల్లించండి. రుసుము తప్పనిసరిగా పోస్టల్ ఆర్డర్/డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి.
-APPLICATION FOR THE RECRUITMENT OF SPORTSPERSON IN CRPF AGAINST SPORTS QUOTA-2022 ఎన్వలప్‌పై పోస్ట్ పేరును తప్పనిసరిగా పేర్కొనాలి.
-నోటిఫికేషన్లో పేర్కొన్న చిరునామాకు దరఖాస్తు తప్పనిసరిగా చేరుకోవాలి.
నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Police jobs, Telangana constable