తెలంగాణలో(Telangana) ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఒక వైపు పలు పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు లభిస్తున్నాయి.. మరో వైపు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 4 తో పాటు.. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రెగ్యూలర్ పోస్టులతో పాటు.. ఔట్ సోర్సింగ్(Out Sourcing) విధానంలో కూడా పలు ఉద్యోగాల భర్తీకి తెలంగాణలో నోటిఫికేషన్లు వెల్లడవుతున్నాయి. దీనిలో భాగంగా.. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా గల 1491 అప్తాల్మిక్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న రెండో విడత కంటి వెలుగు పథకంలో భాగంగా పారామెడికల్ సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలలో నోటిఫికేషన్లు విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. వైద్య, జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
విద్యార్హత ..
అప్తాల్మిక్ విభాగంలో డిప్లొమా/ఆప్టోమెట్రీ లో డిప్లొమా/ ఆప్టోమెట్రీ లో డిగ్రీ / క్లినికల్ ఆప్టోమెట్రీ లో డిగ్రీ / అప్తాల్మిక్ విభాగంలో వొకేషనల్ ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు.. తెలంగాణ పారామెడికల్ బోర్డు నందు రిజిస్టర్ అయి ఉండాలి.
వయోపరిమితి..
18 – 44 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST, BC లకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ - డిసెంబర్ 2, 2022 నుంచి ప్రారంభం అయింది.
దరఖాస్తులకు చివరి తేదీ - డిసెంబర్ 5, 2022.
వాక్-ఇన్-ఇంటర్వ్యూ - డిసెంబర్ 05, 2022
ప్రొవిజినల్ లిస్ట్ జారీ చేయబడే తేదీ - డిసెంబర్ 06, 2022
అభ్యర్థులకు అభ్యంతరాలు మరియు ప్రత్యుత్తరాల స్వీకరణకు చివరి తేదీ - డిసెంబర్ 06, 2022
తుది మెరిట్ జాబితా మరియు ఎంపిక జాబితా ప్రదర్శన తేదీ - డిసెంబర్ 7, 2022
అపాయింట్ మెంట్ ఆర్డర్స్ జారీ తేదీ - డిసెంబర్ 9, 2022
అంటే ఉద్యోగాల భర్తీ ప్రాసెస్ అనేది 8 రోజుల్లో పూర్తి కానుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ జిల్లా అధికాక వెబ్ సైట్ ను సందర్శించి.. దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. ఇది ఆయా జిల్లాల వారీగా ఉంటుంది. ఉదాహరణకు ఖమ్మం జిల్లా వాసులు అయితే.. ఈ వెబ్ సైట్ ను సందర్శించొచ్చు.
- అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
-అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
-అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
-అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవడం మంచిది.
- అప్లికేషన్ ఫామ్ మరియు అవసరమైన డాక్యుమెంట్స్ నేరుగా జిల్లా ఆరోగ్య అధికారి కార్యాలయంలో సమర్పించాలి.
-భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ తీసుకొని దగ్గర ఉంచుకోవాలి.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు..
S.S.C లేదా తత్సమాన పరీక్ష సెర్టిఫికెట్, అర్హత పరీక్ష సంబంధిత సర్టిఫికెట్లు మొదలైనవి, అన్ని సంవత్సరాల మార్కుల మెమోలు (అర్హత పరీక్ష), TS పారమెడికిల్ బోర్డు నందు రిజిస్టర్ చేయబదిన సర్టిఫికెట్, తాజా కుల ధృవీకరణ పత్రం, 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు సంబంధిత స్టడీ సర్టిఫికేట్ మరియు ప్రైవేట్ స్టడీ విషయంలో సంబంధిత తహశీల్ధార్ / MRO నుండి నివాస ధృవీకరణ పత్రం, ఎక్స్-సర్వీస్ మెన్ కోటాను క్లెయిమ్ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి సంబంధిత సర్టిఫికెట్లు, EWS అర్హత కలిగిన అభ్యర్థులు తహశీల్దార్ ద్వారా జారీ చేయబడిన సర్టిఫికేట్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Telangana jobs