హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs In UCO Bank: డిగ్రీ అర్హతతో UCO బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..

Jobs In UCO Bank: డిగ్రీ అర్హతతో UCO బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..

Jobs In UCO Bank: డిగ్రీ అర్హతతో UCO బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..

Jobs In UCO Bank: డిగ్రీ అర్హతతో UCO బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..

బ్యాంక్ ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. UCO బ్యాంక్‌లో అనేక పోస్టుల కోసం కొత్త రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభం అయింది. దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 20, 2022 నుంచి ప్రారంభం అయ్యాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

బ్యాంక్ ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) వెల్లడించింది. UCO బ్యాంక్‌లో అనేక పోస్టుల కోసం కొత్త రిక్రూట్‌మెంట్(Recruitment) ప్రక్రియ ప్రారంభం అయింది. దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 20, 2022 నుంచి ప్రారంభం అయ్యాయి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 19 అక్టోబర్ 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. యూకో బ్యాంక్ సెక్యూరిటీ ఆఫీసర్స్ పోస్టుల కోసం ఈ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.ucobank.com ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మొత్తం 10 ఖాళీ పోస్టులను భర్తీ చేస్తారు. UCO బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా, మీరు ఇటీవలి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను చదవవచ్చు. అంతే కాకుండా.. ఆ వెబ్ సైట్ లోనే ఆన్‌లైన్ ఫారమ్‌ నమోదు చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

TSPSC Notification : టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్.. రేపే దరఖాస్తులకు చివరి తేదీ..

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 19 అక్టోబర్ 2022. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మొత్తం 10 ఖాళీగా ఉన్న పోస్టులు రిక్రూట్ చేయబడతాయి.

వయోపరిమితి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 21 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు ఉండాలి.

జీతం..

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.36,000 నుంచి రూ. 63,840 వరకు జీతం చెల్లిస్తారు.

అర్హతలు..

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అంతే కాకుండా.. కమీషన్డ్ ఆఫీసర్ ఆఫ్ ఆర్మీ నేవీ/ ఎయిర్ ఫోర్స్ లేదా అసిస్టెంట్ పారామిలిటరీ కమాండెంట్లు బలగాలు (BSF/CRPF/ITBP/CISF/SSB మొదలైన)లో 5 సంవత్సరాల వరకు సేవ చేసి ఉండాలి.

పరీక్ష తేదీ...

ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ పరీక్ష నవంబర్ 2022/డిసెంబర్ 2022లో జరుగుతుంది

దరఖాస్తు ఫీజు..

దరఖాస్తు ఫీజు UR/EWS/OBC అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి. SC/ST వర్గానికి చెందిన అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించి ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలి. ఆన్ లైన్ పేమెంట్స్ సెప్టెంబర్ 20 నుంచి మొదలయ్యాయి. దీనికి చివరి తేదీ అక్టోబర్ 19, 2022గా నిర్ణయించారు.

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

Step 1: www.ucobank.comలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

Step 2: హోమ్‌పేజీలో, "రిక్రూట్‌మెంట్" ట్యాబ్‌పై క్లిక్ చేయండి

Step 3: ఆన్‌లైన్ దరఖాస్తును పూరించండి

Step 4: దరఖాస్తు ఫీజు చెల్లించండి

Step 5: అవసరమైన అన్ని పత్రాలను సమర్పించండి

Step 6: భవిష్యత్తు సూచన కోసం అదే కాపీని ప్రింట్ తీసుకొని దగ్గర ఉంచుకోండి. దరఖాస్తు ఫారమ్ ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 11, 2022.

Published by:Veera Babu
First published:

Tags: Bank Jobs, Bank Jobs 2022, Career and Courses, JOBS, Jobs in banks

ఉత్తమ కథలు