హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Hyderabad Jobs: హైదరాబాద్ TVVP ఆసుపత్రిలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

Hyderabad Jobs: హైదరాబాద్ TVVP ఆసుపత్రిలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

Hyderabad Jobs: హైదరాబాద్ TVVP ఆసుపత్రిలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

Hyderabad Jobs: హైదరాబాద్ TVVP ఆసుపత్రిలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

Hyderabad Jobs: తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడైంది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడైంది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తారు. హైదరాబాద్ లోని వైద్యా విధాన పరిషత్ ఆసుపత్రిలో సీఏఎస్ స్పెషలిస్ట్‌లు, జీడీఎంవో పోస్టుల భర్తీకి ప్రోగ్రామ్ ఆఫీసర్ కార్యాలయం(HSI) దరఖాస్తులు కోరుతోంది. వీటికి ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారమ్ ను అభ్యర్థులు https://hyderabad.telangana.gov.in/ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్ లను నింపి.. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని ప్రోగ్రామ్ ఆఫీసర్ (హెచ్‌ఎస్&ఐ) కార్యాలయం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ చిరునామాకు పంపాలి.

Non Teaching Jobs In DRDO: డీఆర్డీఓలో మరో నోటిఫికేషన్.. రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం..

ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 22గా నిర్ణయించారు. దీనిలో సీఏఎస్ స్పెషలిస్ట్ లు 66 ఖాళీలు ఉన్నాయి. వీటిలో వివిధ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. రేడియాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థో, జీడీఎంవో, ఓ అండ్‌ బి, అనస్తీషియా, పీడియాట్రిక్స్ లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. డీఎన్ బీ, ఎంబీబీఎస్, ఎండీ, డిప్లొమా చేసిన వాళ్లు అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ వేదిక.. O/o: ప్రోగ్రామ్ ఆఫీసర్ (HS&l), హైదరాబాద్ 4వ అంతస్తులో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఖైరతాబాద్, "ఖైరతాబాద్ గణేష్ పండపం" ఎదురుగా ఖైరతాబాద్, హైదరాబాద్. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 22వ తారీఖున సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తులు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులు మార్చి 31, 2023 వరకు పని చేయాల్సి ఉంటుంది.

BOB Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు .. మరి కొన్ని గంటల్లో ముగియనున్న దరఖాస్తుల ప్రక్రియ..

విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

1. ఓబీ అండ్ జీవై లో 11 పోస్టులు.

2.అనిస్థిషియాలో 19 పోస్టులు.

3.పిడియాట్రిక్స్ విభాగంలో.. 09 పోస్టులు.

4.రేడియాలజీ విభాగంలో 04 పోస్టులు

5.జనరల్ మెడిసిన్ విభాగంలో 08.

6.ఆర్థోపెడిక్స్ విభాగంలో 01

7. జనరల్ సర్జరీ విభాగంలో 11

8. జీడీఎంఓ(GDMO) 3 పోస్టులను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

-దీనిలో లేటెస్ట్ న్యూస్ అనే ఆప్షన్ లో నోటిఫికేషన్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.

-తదుపరి ఓపెన్ అయిన విండోలో ఉద్యోగానికి సంబంధించి నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారమ్ తదితర వివరాలు ఉంటాయి.

-దీనిలో ముందుగా నోటిఫికేషన్ డౌన్ లోడ్ చేసుకొని వివరాలను తెలుసుకోండి.

-తర్వాత అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. దీనిలో వివరాలను నింపి.. వీటితో పాటు.. విద్యార్హత సర్టిఫికేట్లను జతచేయాలి.

-వీటిని ఖైరతాబాద్‌లోని ప్రోగ్రామ్ ఆఫీసర్ (హెచ్‌ఎస్&ఐ) కార్యాలయం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

Published by:Veera Babu
First published:

Tags: Brand Hyderabad, Career and Courses, Hyderabad news, JOBS, Telangana jobs

ఉత్తమ కథలు