నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 9700 ఉద్యోగాలకు నోటిఫికేషన్..?

ఈ నోటిఫికేషన్‌లో స్టాఫ్ నర్సుల దగ్గరి నుంచి ప్రత్యేక వైద్య నిపుణుల వరకు 9700 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రెండు మూడు రోజుల్లో విడుదల చేయనున్నారు.

news18-telugu
Updated: May 27, 2020, 7:56 AM IST
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 9700 ఉద్యోగాలకు నోటిఫికేషన్..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకే నోటిఫికేషన్‌లో 9700 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన నియామాకాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఈ ఉద్యోగాలను వైద్యారోగ్యశాఖ పరిధిలోని బోధనా ఆస్పత్రులు, వైద్య విధాన పరిషత్, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ప్రజారోగ్య శాఖ పరిధిలో పీహెచ్‌సీల్లోని ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్‌లో స్టాఫ్ నర్సుల దగ్గరి నుంచి ప్రత్యేక వైద్య నిపుణుల వరకు 9700 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రెండు మూడు రోజుల్లో విడుదల చేయనున్నారు.

పోస్టుల విధానమిదీ..

ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు ఎంపికైన వారు మూడు సంవత్సరాల పాటు ప్రొబేషనరీ పీరియడ్‌లో పనిచేయాల్సి ఉంటుంది. మూడేండ్ల తర్వాత వారిని రెగ్యులర్ చేస్తారు. అయితే కొత్తగా ఎంపికయ్యే వైద్యులకు మాత్రం ప్రైవేటు ప్రాక్టీసుకు అనుమతి లేదు. బేసిక్ వేతనంలో 15 శాతం ఎన్‌పీఏ(నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్) ఇవ్వనున్నారు. దీనికితోడు వైద్యులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఒక ఏడాది తప్పనిసరిగా గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేయాలి. వైద్యులు, కొన్ని విభాగాల్లో స్టాఫ్ నర్సులు, పరిపాలనా సిబ్బందిని మాత్రమే రెగ్యులర్ ప్రాతిపదికన తీసుకుంటారు. మిగిలిన ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డెంటల్ అసిస్టెంట్ వంటి పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.
Published by: Narsimha Badhini
First published: May 27, 2020, 7:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading