నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

పోస్టులకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తు చేసేందుకు రూ.50 ఫీజు చెల్లించాలని, మార్కుల ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తామని, ఖాళీలో భర్తీలో సొసైటీ కార్యదర్శిదే అంతిమ నిర్ణయమని ప్రకటించింది.

news18-telugu
Updated: July 16, 2020, 8:12 AM IST
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. గిరిజన గురుకులాల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో ఖాళీల భర్తీకి నిర్ణయించింది. అందులో భాగంగానే గిరిజన గురుకులాల్లో బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి గిరిజన గురుకుల సొసైటీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫోర్త్ గ్రేడ్ పోస్టులు 58 వరకు ఉన్నాయని పేర్కొంది. అందుకు సంబంధించిన పోస్టులకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తు చేసేందుకు రూ.50 ఫీజు చెల్లించాలని, మార్కుల ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తామని, ఖాళీలో భర్తీలో సొసైటీ కార్యదర్శిదే అంతిమ నిర్ణయమని ప్రకటించింది. పోస్టులను దరఖాస్తు చేసేందుకు ఈనెల 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు www.tgtwgurukulam.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.
Published by: Narsimha Badhini
First published: July 16, 2020, 8:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading