హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRB Group D Update: రైల్వే గ్రూప్ D అభ్యర్థులకు అలర్ట్.. గ్రూప్ D పరీక్షలపై తాజా అప్ డేట్..

RRB Group D Update: రైల్వే గ్రూప్ D అభ్యర్థులకు అలర్ట్.. గ్రూప్ D పరీక్షలపై తాజా అప్ డేట్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్ D రిక్రూట్‌మెంట్ పరీక్ష కోసం రాత పరీక్షల తేదీలను రైల్వే అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Secunderabad, India

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్ D రిక్రూట్‌మెంట్ రాత పరీక్షల తేదీలను రైల్వే అధికారులు ప్రకటించారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.  ఈ పరీక్ష అనేక దశల్లో నిర్వహించబడుతుంది. RRB గ్రూప్ D ఫేజ్ 1 పరీక్ష 17 ఆగస్టు 2022 నుండి 25 ఆగస్టు 2022 వరకు జరుగుతుంది. ఇతర దశల పరీక్ష తేదీ కూడా నిర్ణీత సమయంలో తెలియజేయబడుతుంది. ఆర్ఆర్ బీ వెల్లడిండిచిన నోటీస్ కొరకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల దరఖాస్తుకు రేపే చివరి తేదీ... టెన్త్ పాసైతే చాలు

అడ్మిట్ కార్డ్‌ని ఎప్పుడు పొందాలో తెలుసుకోండి

SC / ST కేటగిరీ అభ్యర్థుల కోసం ట్రావెల్ అథారిటీని డౌన్‌లోడ్ చేసుకునే లింక్ 9 ఆగస్టు 2022న RRB అధికారిక వెబ్‌సైట్‌లో రాత్రి 10 గంటలకు యాక్టివేట్ చేయబడుతుంది. దీనితో పాటు, అభ్యర్థులు పరీక్ష నగరం మరియు తేదీని కూడా చూసుకోవచ్చు. ఇక పరీక్ష జరిగే రోజుకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అంటే పరీక్ష ఆగస్టు 17న ఉంటే.. మీరు ఆగస్టు 13 లేదా 14 నుండి అడ్మిట్ కార్డ్ పొందడం ప్రారంభిస్తారు. పరీక్ష సమయంలో ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ఉంటుందని పేర్కొన్నారు.

ఖాళీల వివరాలు..

ఈ ప్రక్రియ ద్వారా రైల్వేలో లెవల్ 1 కింద 1,03,769 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందులో జనరల్ కేటగిరీకి 42,355, షెడ్యూల్డ్ కులాల కేటగిరీకి 15,559, షెడ్యూల్డ్ తెగలకు 7,984, ఇతర వెనుకబడిన తరగతులకు 27,378, ఆర్థికంగా బలహీన వర్గాలకు 10,381 పోస్టులు ఉన్నాయి.

ఏ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు?

పేపర్ 100 మార్కులకు ఉంటుంది. దీనిలో నెగెటివివ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కు కోత విధిస్తారు. పరీక్ష 90 నిమిషాలు ఉంటుంది. ఇందులో జనరల్ సైన్స్ నుంచి 25, మ్యాథ్స్ నుంచి 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించాలంటే 40 శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 40 శాతం, ఓబీసీకి 30, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం ఉండాలి. వీటిలో మెరిట్ సాధించిన వారిని పీఈటీకి పిలుస్తారు. దానిని విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులను తదుపరి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుకు పిలుస్తారు.

First published:

Tags: Central Government Jobs, Govt Jobs 2022, India Railways, Job notification, JOBS, Jobs in telangana, Railway jobs, Rrb group d, State Government Jobs

ఉత్తమ కథలు