హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs: ఆ క్వాలిఫికేషన్ ఉన్నవారికి రైల్వేలో 3093 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Railway Jobs: ఆ క్వాలిఫికేషన్ ఉన్నవారికి రైల్వేలో 3093 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Northern Railway Recruitment 2021 | నార్తర్న్ రైల్వే పలు డివిజన్లలో భారీగా ఖాళీలను (Railway Jobs) భర్తీ చేస్తోంది. అప్లై చేయడానికి మరో రెండు రోజులే గడువుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.

  భారతీయ రైల్వేలో సేవలు అందించాలని కోరుకునేవారికి శుభవార్త. నార్తర్న్ రైల్వే (Northern Railway) భారీగా ఖాళీలను భర్తీ చేస్తోంది. అప్రెంటీస్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. మొత్తం 3093 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు 2021 సెప్టెంబర్ 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 20 చివరి తేదీ. అభ్యర్థులకు దరఖాస్తు చేయడానికి సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. నార్తర్న్ రైల్వే పరిధిలోని పలు డివిజన్లలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, కార్పెంటర్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఇవి ఏడాది గడువు ఉన్న అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

  Northern Railway Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


   మొత్తం ఖాళీలు 3093
   లక్నో డివిజన్ 335
   బ్రిడ్జ్ వర్క్‌షాప్, లక్నో 43
   సీ అండ్ డబ్ల్యూ షాప్ ఏఎంవీ, లక్నో374
   లోకోమోటీవ్ వర్క్‌షాప్, లక్నో 333
   లోకోమోటీవ్ వర్క్‌షాప్ (ఎలక్ట్రికల్), లక్నో 225
   జేయూడీడబ్ల్యూ వర్క్‌షాప్ 111
   బ్రిడ్జ్ వర్క్‌షాప్, టీకేజే 65
   టీఎంసీ లైన్ 73
   సీ అండ్ డబ్ల్యూ, ఎన్‌డీఎల్ఎస్ 143
   సీ అండ్ డబ్ల్యూ, డీఎల్ఐ 75
   సీ అండ్ డబ్ల్యూ, డీఈఈ, డీఎల్ఐ డివిజన్ 42
   సీ అండ్ డబ్ల్యూ, హెచ్ఎన్‌జెడ్ఎం 18
   ఎలక్ట్రిక్ లోకో షెడ్ 31
   ఈఎంయూ (డీఎల్ఐ డివిజన్) 29
   డీఎల్ఐ షెడ్, తుగలకబాద్ 106
   డీఎల్ఐ షెడ్, షకుర్‌బస్తీ 61


  TCS NQT 2021: ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్... నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ దరఖాస్తుల్ని ప్రారంభించిన టీసీఎస్

  Northern Railway Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  జాబ్ నోటిఫికేషన్ విడుదల- 2021 సెప్టెంబర్ 14

  దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 20

  దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 20

  మెరిట్ లిస్ట్ విడుదల- 2021 నవంబర్ 9

  విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.

  వయస్సు- 2021 అక్టోబర్ 20 నాటికి 15 నుంచి 24 ఏళ్లు

  దరఖాస్తు ఫీజు- రూ.100

  ఎంపిక విధానం- దరఖాస్తుల్ని పరిశీలించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

  ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  BSF Constable Jobs 2021: టెన్త్ పాస్ అయినవారికి బీఎస్‌ఎఫ్‌లో 269 కానిస్టేబుల్ జాబ్స్... రూ.69,100 వేతనం

  Northern Railway Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా...


  Step 1- అభ్యర్థులు http://www.actapr.rrcnr.org/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

  Step 2- హోమ్ పేజీలో ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి.

  Step 3- ఆ తర్వాత Apply Now పైన క్లిక్ చేయాలి.

  Step 4- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, పుట్టిన తేదీ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

  Step 5- ఆ తర్వాత ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

  Step 6- ఫోటో, సంతకం, వేలిముద్ర అప్‌లోడ్ చేయాలి.

  Step 7- ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.

  Step 8- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Govt Jobs 2021, Indian Railway, Indian Railways, Job notification, JOBS, Railway Apprenticeship, Railways

  ఉత్తమ కథలు