Railway Jobs: ఉత్తర రైల్వేలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

Northern Railway Recruitment 2019 | ఎంపికైనవారు న్యూ ఢిల్లీలోని నార్తర్న్ రైల్వే కమర్షియల్ డిపార్ట్‌మెంట్ కేటరింగ్ యూనిట్‌లో పనిచేయాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: September 16, 2019, 3:54 PM IST
Railway Jobs: ఉత్తర రైల్వేలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
Railway Jobs: ఉత్తర రైల్వేలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రైల్వే జాబ్ కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. కొద్ది రోజుల క్రితం 118 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల్ని ప్రకటించిన ఉత్తర రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి కొద్ది రోజుల క్రితమే షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఉత్తర రైల్వే. సెప్టెంబర్ 16న ఆన్‌లైన్ దరఖాస్తుకు లింక్ యాక్టివేట్ చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ www.rrcnr.org వెబ్‌సైట్‌లో చూడొచ్చు ఫాలో కావాలి. ఎంపికైనవారు న్యూ ఢిల్లీలోని నార్తర్న్ రైల్వే కమర్షియల్ డిపార్ట్‌మెంట్ కేటరింగ్ యూనిట్‌లో పనిచేయాల్సి ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఉత్తర రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Northern Railway Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు- 118
మల్టీ టాస్కింగ్ స్టాఫ్-కమర్షియల్ డిపార్ట్‌‌మెంట్, కేటరింగ్ యూనిట్, సర్వీస్ సైడ్- 94
మల్టీ టాస్కింగ్ స్టాఫ్-కమర్షియల్ డిపార్ట్‌‌మెంట్, కేటరింగ్ యూనిట్, కుకింగ్ సైడ్- 24
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 సెప్టెంబర్ 16
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 15రాతపరీక్ష నిర్వహించే తాత్కాలిక తేదీ- 2019 అక్టోబర్ 31

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Jio Jobs: రిలయెన్స్ జియోలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

IGNOU: ఉద్యోగం చేస్తూ చదువుకోవాలనుకుంటున్నారా? ఇగ్నోలో కోర్సులు... సెప్టెంబర్ 30 చివరి తేదీ

Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Published by: Santhosh Kumar S
First published: September 16, 2019, 3:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading