• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • NORTHEAST FRONTIER RAILWAY NFR RRC RECRUITMENT 2020 NOTIFICATION RELEASED FOR 4499 APPRENTICE POSTS KNOW ELIGIBILITY AND OTHER DETAILS SS

Railway Jobs: రైల్వేలో 4499 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే

Railway Jobs: రైల్వేలో 4499 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

NFR RRC Recruitment 2020 | రైల్వేలో ఉద్యోగం కోరుకునేవారికి గుడ్ న్యూస్. 4499 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. నార్త్ ఈస్ట్ ఫ్రంటీయర్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ 4499 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటీస్ పోస్టులు ఇవి. వేర్వేరు డివిజన్లలో మెషినిస్ట్, వెల్డర్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, లైన్‌మెన్ లాంటి పోస్టులు ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 15 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను నార్త్ ఈస్ట్ ఫ్రంటీయర్ రైల్వే-NFR అధికారిక వెబ్‌సైట్ https://nfr.indianrailways.gov.in/ చూడాలి. ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.

    HAL Jobs: హిందుస్తాన్ ఏరోనాటికల్స్‌లో 2000 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

    DRDO Jobs: గుడ్ న్యూస్... డీఆర్‌డీఓలో 311 ఉద్యోగాలకు గడువు పెంపు

    NFR RRC Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


    కతిహార్ అండ్ టీడీహెచ్ వర్క్‌షాప్- 970
    అలీపూర్‌దువార్- 497
    రంగియా- 435
    లుండింగ్ అండ్ ఎస్ అండ్ టీ వర్క్‌షాప్- 1302
    టిన్సుకియా- 484
    న్యూ బొంగైగాన్ వర్క్‌షాప్- 539
    దిబ్రూఘ్- 276

    NFR RRC Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 16
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 15 రాత్రి 10 గంటలు
    విద్యార్హత- 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ కనీసం 50 శాతం మార్కులతో పాస్ కావాలి. మరిన్ని వివరాలు నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
    వయస్సు- 2020 జనవరి 1 నాటికి 15 నుంచి 2 4 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
    దరఖాస్తు ఫీజు- రూ.100
    ఎంపిక విధానం- 10వ తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ సిద్ధం చేస్తారు.
    Published by:Santhosh Kumar S
    First published: