భారతీయ రైల్వేలో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. నార్త్ సెంట్రల్ రైల్వే భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1664 పోస్టుల్ని ప్రకటించింది. నార్త్ సెంట్రల్ రైల్వే పరిధిలో డివిజన్లు, వర్క్‌షాప్స్‌లో ఈ పోస్టులు ఉన్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు ఈ పోస్టులకు 2021 ఆగస్ట్ 2న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 1 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది నార్త్ సెంట్రల్ రైల్వే. ఎంపికైనవారికి ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.rrcpryj.org/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంటుంది. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
IT Jobs 2021: ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్స్‌కి 1,20,000 ఉద్యోగాలు
UPSC Recruitment 2021: జర్నలిజంలో అనుభవం ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... రూ.1,42,000 వేతనం
ఫిట్టర్
వెల్డర్
ఆర్మేచర్ వైండర్
మెషినిస్ట్
కార్పెంటర్
ఎలక్ట్రీషియన్
పెయింటర్
మెకానిక్
ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటనెన్స్
వైర్‌మ్యాన్
ప్లంబర్
మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్
హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్
మల్టీమీడియా అండ్ వెబ్ పేజ్ డిజైనర్
మెకానిక్ మెషీన్ టూల్స్ మెయింటనెన్స్
క్రేన్ ఆపరేటర్
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)
స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్)
స్టెనోగ్రాఫర్ (హిందీ)
TCS National Qualifier Test: ఈ ఎగ్జామ్ రాయండి... కార్పొరేట్ కంపెనీలో జాబ్‌కి ట్రై చేయండి
SBI Jobs 2021: ఎస్‌బీఐలో 6100 ఉద్యోగాలు... ఎంపిక చేసేది ఇలాగే
దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 2
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 1
విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
వయస్సు- 2021 సెప్టెంబర్ 1 నాటికి 15 నుంచి 24 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు
ఎంపిక విధానం- ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
అభ్యర్థులు ముందుగా నార్త్ సెంట్రల్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ వెబ్‌సైట్ https://www.rrcpryj.org/ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో అప్రెంటీస్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.
Apply online పైన క్లిక్ చేస్తే దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది.
అభ్యర్థుల పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయాలి.
ఆధార్ నెంబర్ లేనివాళ్లు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
యాక్టీవ్‌లో ఉన్న మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత పోస్ట్ పేరు, డివిజన్ సెలెక్ట్ చేయాలి.
చివరగా ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.
అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways, Upcoming jobs