Home /News /jobs /

NORTH CENTRAL RAILWAY NCR RECRUITMENT 2021 FOR 480 APPRENTICE POSTS HERE FULL DETAILS NS

Railway Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు నార్త్ సెంట్రల్ రైల్వే శుభవార్త చెప్పింది. పలు అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

    నిరుద్యోగులకు నార్త్ సెంట్రల్ రైల్వే శుభవార్త చెప్పింది. పలు అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు నుంచే అప్లికేషన్లను ప్రారంభించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సూచించిన ఫార్మాట్లో ఏప్రిల్ 16లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 480 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

    ఖాళీల వివరాలు..
    ఫిట్టర్-286 పోస్టులు
    వెల్డర్-11 పోస్టులు
    మెకానిక్-84 పోస్టులు
    కార్పెంటర్-11 పోస్టులు
    ఎలక్ట్రీషియన్-88 పోస్టులు

    అర్హతల వివరాలు..
    ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో టెన్త్ పాసై ఉండాలి. దీంతో పాటు NCVTకి అనుబంధం పొందిన సంస్థ నుంచి ఐటీఐ పాసై ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఉపకారవేతనం అందిస్తారు. దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 15-24 ఏళ్ల మధ్యలో ఉండాలి.

    Official Website-Direct Link

    ఎలా అప్లై చేయాలంటే..
    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 16లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు https://www.mponline.gov.in/  లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ను సబ్మిట్ చేసిన అనంతరం ప్రింట్ తీసుకుని కాపీని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి. అప్లికేషన్ ప్రక్రియ ఈ రోజుతో ప్రారంభం కానుంది. మరి కొద్ది సేపట్లో లింక్ ఆక్టివేట్ అవుతుంది.

    అప్లికేషన్ ఫీజు..
    అప్లై చేసుకునే సమయంలో జనరల్ అభ్యర్థులు రూ. 170ని పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Govt Jobs 2021, Indian Railways, JOBS, RRB

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు